ఎప్పుడు సంచనాలతో కాలం గడిపే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాతో నిత్యం వివాదాలతో సతమతమవుతున్న రామ్ గోపాల్ వర్మ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుడుతున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ లో రాజ్యమేలుతున్న ఓ సామాజిక ఆంశాన్ని కీలక కథగా మార్చుకుని సినిమా చేయబోతున్నాడు. అందుకు ఆయనే స్వయంగా ట్వీట్టర్ వేధికగా తన తదుపరి చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు.
అయితే వివాదాలే పనిగా చేసుకునే ఆర్జీవి ఎప్పుడు ఏదో ఓ సినిమా చేస్తూనే ఉంటారు. ఓ సినిమా షూటింగ్లో ఉండగానే మరో రెండు సినిమాలకు ప్రకటన ఇస్తారు వర్మ. ఇప్పుడు అదే జరిగింది. ఆయన తాజాగా తీస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా షూటింగ్ ముగించుకుందో లేదో మరో సినిమాను ప్రకటించాడు వర్మ. షార్ట్ ఫిల్మ్ తీసినంత ఈజీగా వర్మ సినిమాను చేస్తారు. అంతేకాదు వివాదస్పద సినిమా టైటిల్స్‌తో కావల్సినంత ప్రచారాన్ని పైసా ఖర్చు లేకుండా పొందుతాడు వర్మ. అందులో భాగంగా వివాదమే పెట్టుబడిగా, విమర్శలే ప్రచారంగా వాడుకుంటూ ఆ తరహా సినిమాలు తీస్తున్నారు.
ఇప్పుడు వర్మ, జార్జ్ రెడ్డి సినిమాలో హీరోగా నటిస్తోన్న సందీప్ మాధవ్ హీరోగా ఓ సంచలన చిత్రం చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. వర్మ తన ట్విట్టర్లో రాస్తూ, విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టుల మీద సినిమాలు తీసిన నేను..హైదరాబాద్ దాదాలపై ఓ సినిమా చేస్తున్నాని తెలిపాడు. హైదరాబాద్‌లో 1980లో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా సినిమా ఉంటుందని ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమాలో నటించడానికి సందీప్ మాధవ్ సైన్ కూడా చేశాడని వర్మ పేర్కోన్నాడు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఈ దాదాల నేపథ్యంలో తెరకెక్కించే ఈ సినిమాలో ఎవ్వరెవ్వరిని కెలుకుతాడో అనే సందేహాలు నెలకొంటున్నాయి.