దగ్గుబాటి వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య.. వీరిద్దరు నిజ జీవితంలో మామ అల్లుండ్లు.. అయితే ఇప్పుడు రీల్ జీవితంలోనూ నిజ జీవిత పాత్రలనే పోషించబోతున్నారు. వెంకిమామగా ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం. ఈ చిత్రంకు బాబీ దర్శకత్వం వహించగా, పీపుల్స్ మీడియా, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇందులో పాయల్ రాజ్‌పుత్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందించాడు. కాగా ఈ మూవీ విడుదల విషయంలో ఎప్పటినుంచో డైలమా నడుస్తూ వస్తోంది.
అయితే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు చిత్ర నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌ల మధ్య కాంపిటేషన్ ఫుల్‌గా ఉండటంతో క్రిస్మస్ బరిలో వెంకీమామను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావించారు. కానీ ఓ క్లారిటీ రాలేదు. దీంతో అగ్రనిర్మాతలుగా ఉన్న దిల్ రాజు, దగ్గుబాటి సురేష్‌బాబులు ఇద్దరు కూర్చోని ఓ అండర్ స్టాండింగ్‌కు వచ్చారు. క్రిస్మస్కు వెంకిమామ, ఈనెల 13కి దిల్ రాజు నిర్మించిన ఇద్దరి లోకం ఒకటే సినిమా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ విషయంపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాకపోగా.. వెంకీమామ విడుదల తేదీ డ్రామాను తెరదించేందుకు రానా రంగంలోకి దిగాడు. ఈ సినిమా విడుదల తేదీపై ఓ క్లారిటీని ఇచ్చేశాడు.
ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన నిర్మాతలు.. డిసెంబర్ 13న వెంకీమామ రానుందంటూ చెప్పేశారు. అదే రోజు వెంకటేష్ పుట్టినరోజు కావడం విశేషం. కాగా నాగచైతన్య నటించిన ప్రేమమ్ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించాడు వెంకటేష్. ఇప్పుడు ఈ కాంబినేషన్లో ఫుల్ లెంగ్త్ సినిమా రానుండటంతో అభిమానుల్లో అంచనాలు చాలా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ రైతుగా కనిపించనుండగా.. చైతూ జవాన్‌గా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ విడుదల అవ్వడంతో పాటు.. ప్రీ రిలీజ్ వేడుక కూడా ఉండబోతోంది. అయితే సినిమా ఈనెల 13న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ కూడా సోషల్ మీడియాలో పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. సో వెంకిమామ ఈనెల 13న రాబోతున్నాడు.