రాజ‌ధాని అమ‌రావ‌తిపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం ?

అధికార‌, ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌, రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి సంస్థ చ‌ట్టం ర‌ద్దు బిల్లులకు శాస‌న మండ‌లిలో బ్రేక్ ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దీనిని సీరియ‌స్‌గా సీఎం జ‌గ‌న్ ఈ అంశంలో మ‌రింత దూకుడు పెంచారు. ఒక‌వైపు శాస‌న‌మండలిని ర‌ద్దు చేయాల‌ని సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. సోమ‌వారం నిర్వ‌హించ‌నున్న స‌మావేశంలో ఆ మేర‌కు బిల్లుల‌ను అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టి ఆమోదం పొంది పార్ల‌మెంట్‌కు పంప‌నున్నారు. అదేస‌మ‌యంలో అమ‌రావ‌తి అభివృద్ధిపైనా జ‌గ‌న్ ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్ప‌టికే ఆ దిశ‌గా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వైసీపీ శ్రేణులు వివ‌రిస్తున్నాయి. రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని 25 గ్రామాల‌తో పాటు, మ‌రో మూడు గ్రామాల‌ను క‌లుపుతూ అమ‌రావ‌తి కాపిట‌ల్ సిటి మున్సిప‌ల్‌ కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

ఆయా గ్రామాల ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను, అభ్యంత‌రాల‌ను స్వీక‌రించే ప‌నిలో ఇప్ప‌టికే అధికారులు నిమ‌గ్న‌మ‌య్యారు. ఇప్ప‌టికే పెద‌మ‌రిలో గ్రామ‌స‌భ‌ను నిర్వ‌హించ‌గా మున్సిప‌ల్‌లో విలీనానికి వారు స‌మ్మ‌తించిన‌ట్లు తెలుస్తున్న‌ది. అదే స‌మ‌యంలో సీఆర్డీఏ ర‌ద్దును కూడా ఆ గ్రామ‌స్తులు తీవ్రంగా వ్య‌తిరేకించిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు రాజ‌ధాని ప్రాంత గ్రామాల్లో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించొద్ద‌ని తాడికొండ ఎమ్మెల్యే శ్రీ‌దేవి ఎన్న‌కిల సంఘాన్ని ఆశ్ర‌యించింది.

Tags: amaravathi capital city muncipal corporation, ap cm jagan mohanreddy