టాలివుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్… రామ్ చరణ్ హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకు సిద్దమవుతుంది. ప్రస్తుతం సినిమాలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే విదేశాల్లో కూడా షూటింగ్ జరిగే అవకాశం ఉందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా పూర్తి కాక ముందే ప్రముఖ దర్శకులు అందరూ కూడా తారక్ వెంట పడుతున్నారు.
తమతో సినిమా చెయ్యాలని కోరుతున్నారు. ఇటీవల దిల్ రాజ్ సన్నిహిత దర్శకుడు ఒకరు సినిమా చేస్తామని వెళ్ళగా దానికి తారక్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని అంటున్నారు. తాను ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మీద దృష్టి పెట్టా అని ఇతర సినిమాల మీద తనకు ఇప్పుడు అంత ఆసక్తి లేదని ఈ సినిమా తర్వాత తాను విదేశాలకు వెళ్తాను అని చెప్పారట తారక్. దీనితో ఆ దర్శకుడు చేసేది లేక తిరిగి వచ్చి ఆ కథను మరో హీరోకి చెప్పినట్టు సమాచారం. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ మొదలవుతుందని అంటున్నారు.
తారక్ ఈ సినిమాను చాలా సీరియస్ గా తీసుకున్నాడని అంటున్నారు. ఇందుకోసం అవసరమైతే బరువు తగ్గడం, పెరగడం కూడా చేస్తున్నాడని… రాజమౌళి తారక్, చెర్రీ పాత్రల మీద ఎక్కువ దృష్టి పెట్టాడని అందుకే వాళ్ళు కూడా సీరియస్ గా ఉండి ఇతర కథలను వినే ప్రయత్నం కూడా చేయడం లేదని అంటున్నారు. రాజమౌళికి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం. వీరి కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు కూడా విజయం సాధించాయి. దీనితో తారక్ ఆ సినిమా మీద ఎక్కువ దృష్టి పెట్టాడట.