రవితేజ డిస్కోరాజ ప్రీరిలీజ్‌ బిజినెస్‌ ఎంతో తెలుసా?

మాస్‌మహారాజ రవితేజ నటించిన డిస్కో రాజ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. శుకవ్రారం రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమాలో ముగ్గురు హిరోయిన్లు నబానటేష్‌, ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌, బాబీ సింహా నటించనుండ, తమన్‌ సంగీతం సమకూర్చాడు. పీటీఎస్‌డీ (పోస్ట్‌ ట్రామోటిక్‌ డిసార్డర్‌) నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. బర్మా సేత పాత్రలో బాబీ సింహ పోషించనుంది. అయితే ఇటీవలే ఈ సినిమా ప్రీరిలిజ్‌ చేపట్టగా కాసుల వర్షాన్ని కురిపించింది. భారీ మొత్తంలో కొల్లగొట్టిందని టాలివుడ్‌ ట్రేడ్‌వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ప్రపంచం వ్యాప్తంగా ఈ సినిమా ప్రీరిలీజ్‌ ద్వారా సుమారు రూ. 22 కోట్లను రాబట్టిందని వారు అంచనా వివరిస్తున్నారు. అందులో నైజాంలో 6, వైజాగ్‌, 1.95, తూర్పు 1.25, వెస్ట్‌గోదావరి 1.5, కృష్ణ 1.25, గుంటూరు 1.50. నెల్లూరు 0.65, ఇతర చోట్ల రూ. 2.75 మొత్తంగా ఏపీ, తెలంగాణ ఏరియాల్లో 16. 4 కోట్లు రాబట్టిందని అంచనా. ఇక ఓవర్సీస్‌లో 1.50, కర్ణాటకలో 1.10, ఇతర అన్ని ప్రాంతాల్లో .50 కోట్ల బిజినెస్‌ చేసిందని ట్రేడ్‌వర్గాలు తెలుపుతున్నాయి. ప్రిరిలీజ్‌ కలెక్షన్లు 26 కోట్లు దాటితే ఆ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలుస్తుందని టాలివుడ్‌ వర్గాల అభిప్రాయం కాగా, ఈ సినిమా ఇప్పటికే 22 కోట్లను రాబట్టింది. దీంతో హిట్టందుకోవడం ఖాయమని వారు వివరిస్తున్నారు. సినిమా విడుదలయ్యాక ఏ మేరకు వసూళ్లను రాబడుతుందా? అని అప్పుటు టాలివుడ్‌ ట్రేడ్‌ వర్గాలు అంచానాలు వేయడంలో మునిగిపోయాయి.

Tags: disco raja movie, nata nabhes, payal rajputh, prerelese, RaviTeja