తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు.
1910లో ఒక క్రోమో మెగాఫోను ను, 4000 అడుగుల ఫిలిమ్‌ను విదేశాలనుండి తెప్పించుకొని వాటిని ప్రదర్శించడం ఆరంభించారు. ఒక టూరింగ్ టెంట్ ద్వారా ప్రదర్శనలిస్తూ ఆయన అప్పటి మూగసినిమాలకు సంగీతం వంటి ఆకర్షణలు జోడించేవాడు. 1921 లో స్టార్ అఫ్ ది ఈస్ట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి భీష్మప్రతిజ్ఞ అనే మొట్టమొదటి తెలుగు మూకీ చరిత్రాన్ని నిర్మించారు.
తెలుగు చిత్ర రంగానికి మెరుగులు దిద్దటానికి ఎన్నో కష్ట నష్టాలను భరించి తెలుగు చిత్ర రంగానికి శ్రీకారం చుట్టిన మహాను బావుడు. ఆయన సేవలను గుర్తించిన అంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1980 వ సంవత్సరములో రఘుపతి వెంకయ్య అవార్డు ను నెలకొల్పినారు. సినీ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ బహుమతి ప్రధానం చేస్తారు.
రఘుపతి వెంకయ్య నాయుడు గారి పాత్రలో నరేష్ నటిస్తున్న రఘుపతి నాయుడు బయోపిక్ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేసారు.