స్వరమాంత్రికుడు మణిశర్మ అప్పుడే రంగంలోకి దాగాడు. తాను రంగంలోకి దిగాడంటే పని పూర్తి చేసిగాని రిలాక్స్ కాడు. ఇంతకు మణిశర్మ రంగంలోకి ఎందుకు దిగాడు. ఎక్కడ పనిచేస్తున్నాడు అనుకుంటున్నారా..? ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో పనిచేసేందుకు సిద్దమయ్యాడు. ఆ సినిమా పనిలోనే మణిశర్మ రంగంలోకి దిగాడు. ఇంతకు మెగాస్టార్ కోసం స్వరాలు కూర్చే పని ఎక్కడ చేస్తున్నాడు అనుకుంటున్నారా.. అయితే మీరే చూడండి..
మెగాస్టార్ చిరంజీవి తన కేరీర్లో 152వ చిత్రంగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ సినిమా ఓ సందేశాత్మక చిత్రంగా రాబోతుంది. అయితే ఈ సినిమా పనిలో దర్శకుడు శివ నిమగ్నమయ్యాడు. ప్రీ ప్రొడక్షన్ పనులను అటు కొరటాల శివ, ఇటు మెగాస్టార్ చిరంజీవిలు పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమాలో భారీ హీరోయిజం ఉండబోతుందని అందుతున్న సమాచారం. అయితే ఈసినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభయ్యాయని చిత్రసీమలో ప్రచారం జోరుగా వినిపిస్తుంది.
మెగాస్టార్ చిరంజీవికి ఎన్నో మధురమైన మ్యూజికల్ చిత్రాలను అందించిన మణిశర్మకు మెగాస్టార్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ అనుబంధంతోనే ఇప్పుడు మణిశర్మకు మెగాస్టార్ తన చిత్రానికి ఎంపిక చేశాడు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, మణి శర్మ, దర్శకుడు కొరటాల శివ ఈ చిత్ర మ్యూజిక్ సిట్టింగ్ ల కోసం బ్యాంకాక్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాంకాక్‌లోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. డిసెంబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభించి ఈ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. సినిమాలోని టెక్నిషియన్స్, నటీనటుల ఎంపిక పూర్తి చేసినట్లు వినికిడి. ఇక సినిమా పట్టాలెక్కడమే తరువాయి.