ప్రిన్స్ మహేష్‌బాబు అభిమానులు ఇప్పుడు ప్రచార హోరు మోతమోగిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరూ సినిమా విడుదలకు ఇంకా నెలన్నర టైమ్ ఉంది. సంక్రాంతి బరిలో ఉన్న ఈసినిమాకు ప్రచార కార్యక్రమాలకు తెరలేచింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్‌లు విడుదల చేసిన చిత్ర యూనిట్, ఇప్పుడు భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తూ దూసుకుపోతుంది. ప్రిన్స్ మహేష్‌బాబు అభిమానులు ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ సినిమా హోర్డింగ్‌ను పెద్ద ఎత్తున్న ఏర్పాటు చేసి మిగతా హీరోల అభిమానులకు షాక్ ఇచ్చారు.
మహేష్ బాబు అభిమానులు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సుదర్శన్ థియోటర్ వద్ద 80అడుగల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ ఇప్పుడు హైదరాబాద్ లోనే అత్యంత పెద్దదిగా మహేష్‌బాబు అభిమానులు చెప్పుకుంటున్నారు. ఈ కటౌట్ ఇప్పుడు హైదరాబాద్‌లోనే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ప్రిన్స్ మహేష్ బాబు సినిమా విడుదల అయ్యే సమయానికి చిత్ర ప్రమోషన్‌ను చిత్ర యూనిట్ కన్నా అభిమానులే ఎక్కువగా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటీవల సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టిన రోజున టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. దాదాపు 1.30నిమిషాల నిడివి కలిగిన ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. ఈ టీజర్ ఇప్పుడు యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుండగా, ఇక రాబోవు రోజుల్లో చిత్ర ప్రమోషన్ భారీగా చేసేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమైంది. ఇక ముందు ముందు చిత్ర ప్రమోషన్ ను భారీగా చేపట్టి సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. సో మహేష్‌బాబు అభిమానులు ఏర్పాటు చేసిన ఈ కటౌట్ చిత్ర ప్రమోషన్‌ను పతాకస్థాయికి తీసుకుపోయిందనుటలో ఎలాంటి సందేహం లేదు.