ప్రిన్స్ మహేష్ బాబు పుణ్యమాని ఇప్పడు అల్లరోడికి ఆపదొచ్చింది. తన అల్లరి ఆట పాటలతో అందరిని నమ్మించే ఈ అల్లరోడు మహేష్‌బాబు సినిమాతో సైడ్పోయాడు. ఇప్పుడు మహేష్‌బాబు సైడ్ అయితే తప్ప ఈ అల్లరోడికి లైన్ క్లియర్ అయ్యెట్టు లేదు. ఇంతకు ప్రిన్స్ మహేష్‌బాబు అడ్డుగా ఎవ్వరికున్నాడు.. మహేష్‌బాబుతో సైడ్ అయ్యిన ఈ అల్లరోడు ఎవ్వరు అనుకుంటున్నారా..? అయితే ఒకసారి చూద్దాం…
ప్రిన్స్ మహేష్‌బాబు ప్రస్తుతం సరిలేరు నీఎవ్వరు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కి విడుదల కానున్నది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు పూర్తి కావొస్తుంది. అయితే ఈ సినిమా వలన ఇప్పుడు ఓ కమెడియన్ సినిమా పక్కదారి పట్టింది. ఇంతకు ఎవరా కమెడియన్ అనుకుంటున్నారా.. కమెడియన్ ఎవ్వరో కాదు అల్లరి నరేష్. మహేష్‌బాబు వల్ల అల్లరి నరేష్ కు వచ్చిన నష్టం ఏమిటో అనే కాద. అల్లరి నరేష్ హీరో అవకాశాలు రాకపోవడంతో ఇప్పుడు రెండో హీరోగా నటిస్తున్నాడు. మహర్షి సినిమాలో మహేష్‌బాబు స్నేహితుడిగా నటించాడు.
ఈ సినిమా హిట్ అయినప్పటికి అల్లరి నరేష్‌కు మాత్రం అవకాశాలు రాలేదు. అయితే అల్లరి నరేష్ మాత్రం సందులో సడేమియాలాగా ఏకే ఎంటర్టైన్మెంట్లో ఓ సినిమాను చేశాడు. ఈ సంస్థ అధినేత దర్శకుడు అనిల్ సుంకర. అయితే అనిల్ సుంకర ప్రస్తుతం మహేష్‌బాబుతో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీంతో అల్లరి నరేష్ ప్రాజెక్టు చివరి దశలో నిలిచిపోయింది. నరేష్ నటించిన సినిమా కు కేవలం కొన్ని ప్యాచ్ వర్క్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ కొద్ది పాటి ప్యాచ్ వర్క్‌లు పూర్తి చేస్తే సినిమా విడుదల చేసుకునే అవకాశం ఉంటది. కాకుంటే మహేష్‌బాబు సినిమా కావడంతో అల్లరి నరేష్ సినిమా సైడ్ అయిపోయింది. ఇప్పుడు మహేష్‌బాబు సినిమా పూర్తి అయితే తప్ప అల్లరి నరేస్ సినిమా పట్టాలెక్కదు. పాపం మహేష్‌బాబు సినిమా నరేష్ కేరీర్‌కు కష్టాలు తెచ్చిపెట్టింది.