జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోజు రోజుకు జగన్ ప్రభుత్వంపైన ఉద్యమ ఉదృతిని పెంచారు. మాటల యుద్ధం సాగిస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో కూడా తనదైన పంథాలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్‌పైన మాతృభాషపై చేసిన పలు ఆసక్తి కరమైన వ్యాఖ్యాలు చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యాలు ఇలా ఉన్నాయి. పరాయిభాష మోజులో పడి మాతృభాషను మృతభాషగా మార్చొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సూచించారు.
పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం తన సోషల్ మీడియా లోని ట్వీట్టర్ ఖాతాలో మాతృభాషపై పలు ఆంశాలను పోస్టు చేశారు. ట్వీట్టర్లో పవన్ కళ్యాణ్ సీఎం జగన్‌కు ఇలా ట్వీట్ చేశారు. జగన్ రెడ్డి భాష సరస్వతిని అవమానించకండి. జగన్ రెడ్డి .. అంటూ పోస్టు చేశారు.
అదే విధంగా మా తెలుగు తల్లి అని పాడాల్సిన మీరు తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు పవన్. మరొక ట్వీట్లో ఇలా రాసుకొచ్చారు పవన్. తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపర్ నడుపుతూ,తెలుగుని చంపేసే ఆలోచన ,భస్మాసుర తత్వాన్ని సూచిస్తుంది. మాతృ భాషని, మృత భాషగా మార్చకండి అంటూ హితువు పలికారు.
ఇంగ్లీషు భాష ని వద్దని ఎవరు చెప్పటం లేదు కానీ, తెలుగుని మృత భాషగా కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి చెప్పాలి అంటూ ట్వీట్ చేశారు. మాతృభాషని, మాండలీకాలని సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదే అని ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేశారు పవన్. పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్లకు ఏపీ సీఎం జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.