మాటల మాంత్రికుడు.. అయ్యాడు మార్కెట్‌ ప్రచారకుడు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కొత్త అవతారం ఎత్తారు. మార్కెట ప్రచార కర్తగా మారారు. అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. దర్శక దిగ్గజం ఎందుకీ దారిలోకి వచ్చారా? అని ప్రశ్నలు కురుస్తున్నాయి. ఆయన ఫోటోతో ఉన్న పోస్టర్‌ తెగ చక్కర్లు కొడుతున్నది. అసలు విషయం ఏమిటంటే.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన అల వైంకుఠపురంలో సినిమా ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్నది. బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తూ, మంచి వసూల్లను రాబట్టుతున్నది. ఇదిలా ఉండగా సినిమా విడుదలై విజయవంతంగా నడుస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ హీరోతో ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేయడం తెలిసిందే.

అది ఆ హీరో స్టార్‌డమ్‌ను మరింత పెంచేలా ఉంటుంది. అయితే అందుకు భిన్నంగా అలవైకుంఠపురంలో సినిమా యూనిట్‌ దర్శకుడు త్రివిక్రమ్‌ ఉన్న పోస్టర్‌ను విడుదలను చేసింది. అందులో త్రివిక్రమ్‌ రాజకీయ నాయకుడిలా తన రెండు చేతులలను పైకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతుండడం విశేషం. ఈ సోస్టర్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. మరోవైపు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హీరో సాధారంగా లైమ్‌ లైట్‌లో ఉండాలి కాబట్టి ఇలాంటి పోస్టర్లు వాడుకుంటారు. మరి ధర్శకుడు త్రివిక్రమ్‌ ఎందుకు వేయాల్సి వచ్చిందని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ పోస్టర్‌పై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో మాటల మాంత్రికుడు సినిమా ప్రచారకుడు అయ్యాడని విమర్శిస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందా? భవిష్యత్‌లోనూ కొనసాగుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.

Tags: al vykuntapuram lo, new wall poster, thrivikram srinivas