టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు అభిమానులకు జోష్ నింపేందుకు సిద్దమయ్యాడు. అందుకే డిసెంబర్ నెలంతా సూపర్ స్టార్ మహేష్‌బాబు అభిమానులకు పండుగే పండుగ. ప్రిన్స్ మహేష్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా విడుదల అయ్యేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు మహేష్ బాబు. సరిలేరు నీకెవ్వరూ అంటూ రాబోతున్న ఈ సినిమా త్వరలో చిత్ర ప్రమోషన్‌ను భారీగా చేసేందుకు సిద్దమైంది.
సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సంక్రాంతి బరిలో ఉంది. ఈ సినిమా జనవరి 11 న రిలీజ్ కు సిద్ధం అవుతున్న తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ ను రిలీజ్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతున్నది. ఇప్పటికే సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ భారీ విజయం సాధించింది. టీజర్ కు రెస్పాన్స్ రావడంతో దానిని కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ను రిలీజ్ చేశారు.
సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రమోషన్‌ను జోరుగా చేసేందుకు సిద్దమైన చిత్ర యూనిట్ ముందుగా పాటలు విడుదల చేసేందుకు సిద్దమైంది. అందులో భాగంగా డిసెంబర్ 2 వ తేదీన సోమవారం రోజున ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు. అయితే, ఫస్ట్ సింగిల్ సాంగ్ ను ఏ సమయంలో రిలీజ్ కాబోతున్నది అన్నది తెలియాలి.ప్రిన్స్ మహేష్‌బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది.