ఈ మాసం సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఏమాత్రం కలిసి వచ్చినట్లుగా లేనట్లుంది. వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవలే మురుగదాస్ దర్శకత్వంలో ఆయన నటించిన దర్బార్ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది. రికార్డు స్థాయి కలెక్షన్లను కూడా రాబట్టింది. ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శమితవుతుంది. అయినప్పటికీ ఆ సినిమాను పలు వివాదాలు చుట్టుముట్టాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, పలికి సంభాషణలపై అన్నడిఎంకే పార్టీలోని ఓ వర్గం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సినిమా నుంచి ఆ సన్నివేశాలను నిర్మాతలు తొలిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు తరువాత సినిమాలో రజనీ వేషధారణ తదితర అంశాలపైపోలీసు ఉన్నతాధికారులు సైతం విమర్శలకు దిగారు. పలువురు కోర్టుల్లో పిటిషన్లను దాఖలు చేసిన సంగతి విధితమే. ఇప్పుడు తాజాగా ఏకంగా సూపర్‌స్టారే మరో వివాదంలో చిక్కుకున్నారు.
అసలు విషయం ఏమిటంటే తమిళ మ్యాగజైన్ తుగ్లక్ 50వ వార్షికోత్సవాన్ని చైన్నైలో నిర్వహించగా కార్యకమ్రానికి రజనీకాంత్ హాజరై ప్రసగించారు. ఈ సందర్భంగా సామాజిక ఉద్యమకారుడు పెరియార్ రామస్వామిపై ఆయన అభ్యంతకర వ్యాఖ్యలను చేశారు. మూఢనమ్మకాలపై పజ్రలను చైతన్యవంతులను చేయడానికి 1971లో పెరియార్ ఏకంగా సీతా రామలక్ష్మణుల విగ్రహాలకు చెప్పుల దండలు వేసి ఊరేగించారని ఉటంకించారు. ఈ వాఖ్యలపై ద్రవిడార్ విడుతలై ఖజగం తప్పుపట్టింది. రజనీ చెప్పినదాంట్లో ఏమాత్రం నిజం లేదని మండిపడింది. బేషరతుగా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని, లేకంటే సూపరస్టార్ ఇంటినీ, దర్బార్ సినిమా నడుస్తున్న థియేటర్లను ముట్టడిస్తామని హెచ్చరించింది. కోయంబత్తుర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక అదే సభలో రజనీ మాట్లాడుతూ డీఎంకే పార్టీ అధికార పత్రిక మురసోలీపైనా సెటైర్లు వేశారు. ఆ పత్రికను కేవలం ఆ పార్టీ కార్యకర్తలే చదువుతారని, తుగ్లక్ మ్యాగజైన్‌ను అందరూ చదువుతారని వివరించడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి సూపర్‌స్టార్ రజనీ కాంత్ ఏం చేస్తారో? చూడాలి. క్షమాపణలు చెబుతారో? లేక తన వ్యాఖ్యలను సమర్థించుకుంటారో?