అక్కినేని నాగ చైతన్య తన కేరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంలో నటించేందుకు సై అంటున్నాడు. అందుకు నాగచైతన్య రెడి అయినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ కాగా, టాలీవుడ్లో ఈ చిత్రంపై భారీ ప్రచారం జరుగుతుంది. నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా తో మేనమామ విక్టరీ వెంకటేష్ తో కలిసి బాబీ దర్శకత్వం లో వెంకిమామ చేస్తున్నాడు. వెంకిమామ ఈ నెలాఖరున విడుదలయ్యే చేసేందుకు చిత్ర యూనిట్ రంగం సిద్దం చేసింది. దీనితో పాటుగా నాగచైతన్య ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రం మాత్రం వచ్చే ఏడాది ఉగాదికి విడుదల అంటున్నారు.
ఇక ఈ రెండు చిత్రాలు గాక నాగ చైతన్య 14 రీల్స్ ప్రొడక్షన్ లో పరశురామ్ తో సినిమాకి కమిట్ అయ్యాడనే న్యూస్ ఉంది. గీత గోవిందం తర్వాత పరశురామ్ కి స్టార్ హీరోలెవరు పడకపోయినా.. చివరికి నాగ చైతన్య ని లైన్ లో పెట్టాడు. చైతు తో పరశురామ్ సినిమా ఫిక్స్. అయితే ఈ సినిమాకి 14 రీల్స్ వారు భారీగా పెట్టుబడి పెడుతున్నట్లుగా టాక్. చైతు కి జోడిగా రష్మిక ని హీరోయిన్ గా తీసుకుంటున్నారని వినికిడి. మరి ప్రస్తుతం క్రేజ్ ఉన్న రష్మిక కి గట్టిగానే సమర్పించాలి. మరోపక్క బ్లాక్ బస్టర్ హిట్ తో ఉన్న పరశురామ్ కె 8 కోట్ల పారితోషకం తో పాటుగా.. లాభాల్లో వాటాకి 14 రీల్స్ సంస్థ సై అంటుంది.
ఇక చైతు కి 6 కోట్లు. మిగతా నటీనటులకు, టెక్నీకల్ డిపార్ట్మెంట్ కి మరో ఐదు కోట్లు, ఇంకా సినిమాకి 30 నుండి 35 కోట్లు పెడుతున్నట్టుగా ఫిలింనగర్ టాక్. మరి చైతూ ని చూసి అయితే 14 రీల్స్ అంత భారీ బడ్జెట్ అయితే పెట్టరు. ఎందుకంటే చైతూ సవ్యసాచి, శైలజ రెడ్డికి ఎక్కువ పట్టుబడి పెట్టారు. కానీ నిర్మాతలకు చేతులు కాలాయి. అయితే చైతు ని చూసి కాదు గాని పరశురామ్ టాలెంట్ చూసి అంతగా బడ్జెట్ ని 14 రీల్స్ పెడుతున్నట్టుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి.