మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలీస్‌స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హట్రిక్ చిత్రం అలా వైకుంఠపురములో. ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం సినిమా డబ్బింగ్, కంప్యూటర్ గ్రాఫీక్స్ , వీఎఫ్ఎక్స్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ చిత్ర ప్రమోషన్‌ను గత రెండు నెలలుగా జోరుగా సాగిస్తున్న చిత్ర యూనిట్ ఇప్పుడు మరింత జోరు పెంచింది. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉండటంతో చిత్ర ప్రమోషన్ కోసం ముమ్మరంగా కష్టపడుతున్నారు చిత్ర బృందం.
అల్లు అర్జున్ తనదైన ట్రెండ్ సృష్టిస్తూ రెండు పాటలను గత నెలన్నర ముందే విడుదల చేశారు. ఈ పాటలు ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా అవే వినిపిస్తున్నాయి. అయితే ఈ పాటలు సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా లేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్‌ను మరింత పెంచెందుకు చేస్తున్న కసరత్తులో ఓ ట్వీస్ట్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. బన్నీ సినిమా ప్రమోషన్ కోసం మెగా హీరోలనే బరిలోకి దింపుతున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
బన్నీ సినిమా అలా వైకుంఠపురములో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాలని నిర్ణయించింది చిత్ర యూనిట్. అయితే సంక్రాంతి పోటీ తట్టుకోవాలంటే చిత్ర ఫ్రీ రిలీజ్ వేడుకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో ఒకటి హైదరాబాద్‌లో కాగా, మరొకటి తిరుపతి లేదా వైజాగ్‌లో నిర్వహిస్తారని ప్రకటించారు. ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. ఇందులో ఏ ఫంక్షన్‌కు ఎవ్వరు ఎక్కడ హాజరు అవుతారో ఇంకా చిత్ర యూనిట్ ప్రకటించలేదు. అంతే కాదు ఏ తేదీల్లో నిర్వహిస్తారో కూడా ఇంకా ప్రకటించలేదు. సో బన్నీ సినిమాకు మెగాస్టార్, పవర్‌స్టార్ హాజరు కానుండటం ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.