బోయపాటి సినిమా కోసం బాలయ్య కొత్త గెటప్‌?

చిత్రం ఏదయినా సరే. పాత్ర డిమాండ్‌ మేరకు అందుకు అనుగుణంగా మారిపోతారు నందమూరి బాలకృష్ణ. అందుకు లెక్కలేనని ఉదహారణలున్నాయని చెబుతారు అభిమానులు. గతేడాది తండ్రి ఎన్టీఆర్‌ బయోపిక్‌ కోసం అనేక పాత్రలను వేశారు. వివిధ రకాల వేషధారణలతో కనిపించి మెప్పించారు. బాడి లాంగ్వేజ్‌ను మెయింటేన్‌ చేశారు. గతంలోనూ ఆయన ఇలాంటి ప్రయోగాలను ఎన్నో చేశారు. ఎవర్‌గ్రీన్‌ భైరవద్వీపం సినిమాలో ఏకంగా కురూపి పాత్రను ధరించారు. తాజాగా రూలర్‌ సినిమా కోసమూ వివిధ రకాల గెటప్‌లను వేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉన్నాయి.

ఇదిలా ఉండగా బాలయ్య ఇప్పుడు మరో న్యూ లుక్‌తో కనిపిస్తూ అభిమానులను, టాలివుడ్‌ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఖాదీ బట్టలను ధరించి.. గుబురు మీసాలు, గుండుతో దర్శమిచ్చి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించారు. ఆ ఫొటోలను తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ఇప్పుడీ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. రకరకాల ఊహాగానాలను చేస్తున్నారు. అయితే తన ఇంటి దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌ నేతృత్వంలో తెరకెక్కనున్న చిత్రం కోసమే ఈ గెటప్‌ అంటూ టాలివుడ్‌ వర్గాలు తెలుపుతున్నాయి. ఫ్యాన్స్‌ సైతం అదేనని అనుకుంటున్నారు. తమ అభిమాన హీరో ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. మరి బాలయ్య గుండు విశేషాలు తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.

Tags: boyapati srinivas, nandhamuri bala krishna, new getup