బాలకృష్ణ కథానాయకుడి గా లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రెండు దశాబ్దాల క్రితం ఆదిత్య 369 తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్లోనే ఓ మరపు రాని సినిమాగా ఆదిత్య 369 రికార్డులకు ఎక్కింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ముందుగా బాలయ్యే ఈ సీక్వెల్ చేస్తాడని అన్నారు.. ఆ తర్వాత బాలయ్య తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కూడా ఈ సీక్వెల్‌తోనే ఉంటుందన్నారు.
అవేవి జరగలేదు. ఇక ఇప్పుడు ఈ సక్వెల్లోకి మరో నందమూరి హీరో పేరు వచ్చి చేరింది. ఆదిత్య 369 సీక్వెల్‌కు ఆదిత్య 999 అనే టైటిల్ పెట్టారట. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పేరు తెర పైకి వచ్చింది. టైమ్ మెషీన్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలో కళ్యాణ్ నటిస్తున్నాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భూత – భవిష్యత్- వర్తమాన కాలాల ఆధారంగా టైమ్ మెషీన్ బ్యాక్ డ్రాప్లో కళ్యాణ్ రామ్ కోసం ఓ స్క్రిఫ్ట్ రెడీ అయ్యిందని టాక్..?
మల్లిడి వేణు దర్శకత్వం వహించే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ కథ మాత్రం ఆదిత్య 369కు సీక్వెల్ అని అంటున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సతీష్ వేగ్నేశ దర్శకత్వం లో `ఎంతమంచి వాడవురా` అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. అది కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు క్లారిటీ లేనట్టే..?