నట సింహం.. నటరత్న.. యువరత్న.. అంటూ తెలుగు ప్రేక్షకులు కీర్తించే నందమూరి బాలకృష్ణ సినిమాలు ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్లో బొక్కబోర్లా పడుతున్నాయి.. ఆయన నటించే సినిమాకు నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తుండటంతో అవి ఎలా రాబట్టుకోవాలో తెలియని ఆయోమయ పరిస్థితిలో నిర్మాతలు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే బాలయ్య నటించిన రూలర్ సినిమా బిజినెస్‌తోనే నష్టాలు చవిచూస్తున్న నిర్మాతలకు ఇప్పుడు మరో అయోమయ పరిస్థితి వచ్చి పడింది. రూలర్ సినిమా బడ్జెట్‌ను ఎలా పూడ్చుకోవాలో అనే సందిగ్ధంలో నిర్మాత బాగా ఇబ్బంది పడుతున్నారు.
అయితే ఇప్పుడు బాలయ్య తన కేరీర్లో 106వ చిత్రంగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించబోతున్నారు. అయితే ఈ సినిమాకు భారీగా బడ్జెట్ పెట్టేందుకు నిర్మాత సిద్దమవుతున్నాడని ఫిలింనగర్లో టాక్. అయితే ఇంత ఖర్చు చేస్తే సినిమా బిజినెస్ చేస్తుందా.. లేక రిస్క్‌లో పడతామా అనే సందిగ్ధావస్థలో నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారని టాక్. ఇప్పటికే రూలర్ సినిమా దాదాపుగా రూ.15కోట్ల మేర నష్టాల్లో కనసాగుతుంది. అయితే ఇప్పుడు ఇదే నష్టాలు బోయపాటి , బాలయ్య కాంబినేషన్లో వచ్చే సినిమాకు వస్తే పరిస్థితి ఏమిటీ అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
రీసెంట్ టైమ్స్ లో బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా చెప్పుకొనే జై సింహా ఓవరాల్ కలెక్షన్ 50 కోట్ల రూపాయలు. అది కూడా పోటీగా విడుదలైన అజ్ణాతవాసి డిజాస్టర్ గా నిలవడంతో బాలయ్య ఆ అత్యధిక మొత్తాన్ని సాధించగలిగాడు. సొ బాలయ్య సినిమా మీద ఒక 40 కోట్ల దాకా ఖర్చు చేయొచ్చు అనే ధీమాతో 30 నుంచి 40 కోట్ల రూపాయల దాకా సునాయాసంగా ఖర్చు చేస్తున్నారు మన నిర్మాతలు. కానీ.. ఇప్పుడు బాలయ్య 106వ సినిమాకి బోయపాటి ఏకంగా 70 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం దర్శకుడిగా బోయపాటి ఆల్రెడీ 15 కోట్ల రూపాయలు తీసుకొంటుండగా.. తన రెమ్యూనరేషన్ గా బాలయ్య 10 కోట్ల రూపాయలు తీసుకోనున్నాడు.
ఇక్కడికే 25 కోట్లు ఖర్చవ్వగా.. హీరోయిన్లు, విలన్స్ కి ఒక 5 కోట్లు. సపోర్టింగ్ ఆర్టిస్టులు, ప్రొడక్షన్, షెడ్యూల్ ఖర్చులు మొత్తం కలిపి ఈజీగా 70 కోట్ల బడ్జెట్ కనిపిస్తుంది. ఈ మొత్తాన్ని తిరిగి రాబట్టగల బాలయ్య-బోయపాటి కాంబినేషన్ కు ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే.. హీరోగా బాలయ్య మీద ఈస్థాయిలో ఖర్చు చేయడం అనేది మాత్రం రిస్కే అని నిర్మాతలు అంటున్నారు. మరి ఇప్పుడు బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కే చిత్రం బడ్జెట్ ఏమైనా తగ్గుతుందో లేదో చూడాలి మరి.