టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ఉరఫ్ బాలయ్యతో కయ్యానికి కాలు దువ్వుతానంటుంది ఓ లేడీ ఎమ్మెల్యే.. కయ్యమంటే అట్లాంటి ఇట్లాంటి కమ్యం కాదు.. పెద్ద ఎత్తున సమరానికి సై అంటుంది.. అసలే ఇద్దరు ఉత్తర దృవం.. దక్షిణ దృవం పార్టీల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఒక పార్టీకి ఇంకో పార్టీ అంటే పడదు. అలాంటి ఎమ్మెల్యేలు సమరం చేయడానికి ఎప్పుడైనా సిద్దమే కదా.. మరి ఈ లేడీ ఎమ్మెల్యే బాలయ్యతో ఢీ కొట్టేందుకు సై అంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంతకు బాలయ్య శత్రు పార్టీకి చెందిన ఆ లేడీ ఎమ్మెల్యే ఎవ్వరు.. ఇంతకు ఇద్దరు కయ్యానికి కాలు దువ్వేది ఎక్కడ.. అసెంబ్లీలోనా.. లేక మరేదైన చోటనా.. ఇంతకు ఎవరా లేడీ ఎమ్మెల్యే అనుకుంటున్నారా.. అమె అసెంబ్లీలోనే కాదు, వాస్తవంలో కూడా ఫైర్‌బ్రాండే. అమె నటి, నగరి ఎమ్మెల్యే రోజా. ప్రస్తుతం ఏపీఐడీసీ చైర్‌పర్సన్‌గా ఉన్న రోజాకు నిజజీవితంలో కాకుండా రీల్ జీవితంలో బాలయ్యతో సమరానికి సై అనే అవకాశం వచ్చింది. మరి రోజా సరే అంటే సమరమే.. కాదు అంటే అంతే సంగతులు.
గతంలో రోజా హీరోయిన్గా బాలయ్యతో కలిసి భైరవద్వీపం, బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య సినిమాల్లో కలిసి నటించారు. ఇద్దరి కెమిస్ట్రీ అప్పుడు బాగానే కుదిరింది. ఈడు జోడు బాగుందన్నారు ప్రేక్షకులు. కాలం గిర్రున తిరిగింది. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఏపీ అసెంబ్లీలో ఉన్నారు. అయితే బాలయ్య ప్రస్తుతం రూలర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. అయితే బోయపాటి సినిమాలో లేడీ విలన్ కావాలి. అందుకు రోజా అయితే బాగుంటుందనే ఆలోచన వచ్చిందే తడువుగా రోజాను బోయపాటి సంప్రదించారని టాక్. మరి రోజా ఏ నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ, ఇద్దరు బరిలో దిగితే ఆ సినిమా చూడటానికి రెండు కళ్ళు చాలవనుకోండి. మరి రోజా నిర్ణయం ఏమిటో తెలిస్తే సినిమా పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది.