బాలకృష్ణ పరిచయం అక్కర్లేని మాస్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హై ఓల్టేజ్ మూవీస్ చేయాలంటే కనిపించే మొదటి హీరో బాలయ్యే అనటం లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ జోనర్ లో చేసిన సినిమాలలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు బాలయ్య. బాలయ్య చెప్పే డైలాగ్స్ కి హైఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలకి థియేటర్లో కూర్చుని చూసే ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి ఆ రేంజ్ నటన బాలయ్య సొంతం.
తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. కేవలం హీరోని మాత్రమే చూసి సినిమాకి వెళ్లేరోజులు పోయాయి.హీరోతో పాటు, డైరెక్టర్, టెక్నిషన్స్ ఎవరు పనిచేసారు, సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఎలావున్నాయి అని అన్నీ చూసుకుని, వెబ్సైట్ లలో రివ్యూస్ చూసుకుని వెళ్లే రోజులు ఇవి. ఈ రోజుల్లో ఎంత పెద్ద హీరో అయినా సరే ఒక్క సినిమా ప్లాప్ అయితే ఆ హీరో గ్రాఫ్ అమాంతం పడిపోతుంది. దీని వల్లనే చిన్న చిన్న హీరోలు సైతం ఎక్కువ ఖర్చుపెట్టి మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాలు తీసే నిర్మాతలకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు. కానీ బాలయ్య నిర్మాతలు మాత్రం ఇవేమి పట్టించుకోకండి బాలయ్య మంచితనాన్ని ఉపయోగించుకొని వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నట్టుంది.
బాలయ్య బాబు విషయానికొస్తే తనను నమ్ముకున్న నిర్మాతలను, దర్శకులను ఎప్పుడూ ఆదుకుంటూనే ఉంటాడు. కానీ వాళ్ళు మాత్రం బాలయ్య ఇమేజ్ ఉపయోగించుకొని రూపాయలు సంపాదించుకోవాలన్నట్టేఉంటుంది. బాలయ్య లాంటి పెద్ద హీరో సినిమా నిర్మించటానికి అవకాశం ఇస్తే దానిని ఒక మంచి అవకాశంగా తీసుకోకుండా, చీప్ ప్రొడక్షన్ వాల్యూస్, సెకండ్ గ్రేడ్ క్యాస్టింగ్ తో తక్కువ ఖర్చు తో సినిమా తీసేసి ఎంతో కొంత లాభం సంపాదించుకుందాం అనే ఆలోచనే తప్ప, ఇంత మంచి అవకాశం ఇచ్చిన హీరో గురించి కనీస ఆలోచన కూడా చేయటం లేదు. రీసెంట్ గా వచ్చిన బాలయ్య రూలర్ ఫస్ట్ లుక్ బాలయ్య అభిమానులను కూడా ఆకట్టుకోలేక పోయింది, దానికంటే ఫ్యాన్ మేడ్ ఫస్ట్ లుక్ ఎంతో గొప్పగా వుంది. దీనిని చూసే నిర్మాతలు సినిమాను ఎంత గొప్పగా నిర్మిస్తున్నారో అర్ధం చేసుకో వచ్చు.