స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులను నిత్యం అలరిస్తూనే ఉన్నారు. తన చిత్ర ప్రమోషన్‌తో అభిమానులను ఓలలాడిస్తున్న బన్నీ ఇప్పుడు మరోమారు అభిమానులను రంజింప చేయబోతున్నారు. బన్నీ నటిస్తున్న చిత్రం అలా వైకుంఠపురములో చిత్ర ప్రమోషన్‌తో ఓ ఊపు ఊపుతున్న బన్నీ ఇప్పుడు ఈ సినిమా టీజర్ తో తన అభిమానులకు పండుగ వాతావరణం తేబోతున్నాడు.
బన్నీ అభిమానుల కోసం అలా వైకుంఠపురములో సినిమా ప్రమోషన్ భారీగా చేపట్టాడు. అయితే ఇప్పటికే చిత్ర ప్రమోషన్‌ను ఓ పీక్ స్టేజీకి తీసుకుపోయిన బన్నీ ఇప్పుడు మరో ప్రధాన ప్రమోషన్‌కు తెరలేపాడు. ఈనెల 11న అలా వైకుంఠపురములో చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ఈరోజు ప్రకటించనున్నారు.
టీజర్‌తో చిత్ర ప్రమోషన్‌ను అభిమానుల్లో భారీగా చేయబోతున్నాడు. ఇప్పటికే చిత్రంలోని పాటలను వరుసగా విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలనే పెంచారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలే ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో పాటు టీజర్ కు ముందు ఓ చిన్న పైలట్ టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సన్నహాలు చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంక్రాంతి కానుకగా విడుదల కానున్నది.
అయితే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో చిత్ర యూనిట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. చిత్రం ట్రైలర్‌ను జనవరిలో విడుదల చేయనుండగా, ఇక మరో రెండు పాటలను కూడా త్వరలో విడుదల చేయబోతున్నారు. అయితే వరుసగా చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే సినిమాకు రీరికార్డింగ్ పూర్తి చేసుకుంది చిత్రం. ఇక నిర్మాణాంతర సీజీ వర్క్ జోరుగా చేస్తున్నారు. ఇక వీటితో పాటుగా చిత్ర దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు థమన్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ సినిమాను భారీగా విడుదల చేయబోతున్నారు. ఏదేమైనా బన్నీ ఈ సినిమా ప్రమోషన్ విషయంలో ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నాడు.