పవర్‌స్టార్, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్‌పై ఓ సీనియర్ నటి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌ను తన అందంతో ఏలిన అందాల రాశీ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌పై కామెంట్స్ చేయడం ఏమిటనే సంశయం అందరిలో కలుగుతుంది. ఇంతకు ఆ అందాల రాశీ పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్లు ఏమీటీ..? పవన్ పై కామెంట్లు చేసిన ఆమే ఎవరు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
అప్పటి హీరోయిన్ అందాలరాశీ రాశిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. తన నటనతో అందరి మనసుల్ని మెప్పించింది. వరుస హిట్ సినిమాలతో టాప్ హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అరకొర సినిమాల్లో మాత్రం ఆమె కనిపించింది. ఆ తర్వాత కొన్ని టీవీ షోల్లో ఆమె హల్ చల్ చేసింది. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రాశి.
రాశీ నాలుగేళ్ళ క్రితం జరిగిన ఓ సంఘటన గురించి ఇలా చెప్పకొచ్చింది. మా పాప మొదటి పుట్టిన రోజుకి పవన్ కల్యాణ్ ను ఆహ్వానించడానికి వెళ్లాను. అయితే అప్పుడు ఆయన షూటింగులో బిజీగా వున్నారు. పవన్ కల్యాణ్ గారితో నేను గోకులంలో సీత సినిమా చేశాను. ఆ తరువాత ఆయనను ఎక్కడా కలవలేదు. తెలిసిన మనిషే కదా అని నేరుగా కార్లో ఆయన వున్న షూటింగ్ లొకేషన్ కి వెళ్లిపోయాను. అయితే పవన్ కళ్యాణ్ క్యారవాన్ దగ్గర చాలామంది వున్నారు. ఒకప్పటి పవన్ కల్యాణ్ గారు అనుకుని మీరు నేరుగా వచ్చేశారు. ఇక పవన్ కళ్యాణ్‌ను కలవడం కష్టం అనుకున్నాను.
ఆయనను ఇప్పుడు కలవడం కష్టమేననుకుంటాను మేడమ్, అపాయింట్ మెంట్ ఉండాలేమోనని తన డ్రైవర్ చెప్పాడు. అయితే సరే ఒక ప్రయత్నం చేసి చూద్దామని డ్రైవర్ తోనే కబురు పెట్టానని రాశి చెప్పుకొచ్చారు. అయ్యో కబురు చేయడమేంటి రమ్మని చెప్పు అంటూ పవన్ డ్రైవర్ ను నా దగ్గరికి పంపించారు. పవన్ వద్దకు వెళితే ఎంతో ఆప్యాయంగా పలకరించి చాలాసేపు మాట్లాడారంటూ ఆ విషయాల్ని గుర్తు చేసుకున్నారు రాశి. పవన్ కల్యాణ్ క్రేజ్ పెరిగిందిగానీ .. ఆయన మాత్రం మారలేదనిపించిందంటూ పొగడ్తలు కురిపించారు రాశి. అంటే పవన్ కళ్యాణ్ తన తో నటించిన నటీమణులను బాగానే గుర్తు పెట్టుకుంటాడన్న మాట.