ఆ హీరోయిన్ కష్టాలు మామూలుగా లేవు… అనుకున్నది ఒకటైతే .. జరిగింది మరొకటి అన్న చందంగా ఉంది. తనని ప్రేమించిన హీరోని కాదనుకుని.. వేరొక యంగ్ హీరోని ప్రేమించడమే ఆమె పాలిట శాపమైంది. ముదురు వయస్సులో ఆమె కథ అడ్డం తిరగడంతో ఆమె ఇప్పుడు రెండిటికి చెడ్డ రేవడిలా మారింది. ముందుగా తనను ప్రేమించిన హీరోను కాదనుకుని ఓ యంగ్ హీరోతో ప్రేమలో పడి చెట్టా పట్టాలేసుకుని తిరిగింది. అతడితో ఆమె సహజీవనం చేస్తున్నట్టు కూడా ప్రచారం జరిగింది.
ఇప్పుడు ఆ యంగ్ హీరో ఆమెను ఫుల్లుగా వాడుకుని దూరం పెట్టడంతో చివరకు అతడికి కటీఫ్ చెప్పేశాక తిరిగి తనకు అవకాశం ఇచ్చి ప్రేమించి ఆదరించిన ఆ స్టార్ హీరో చెంతకే వచ్చేసింది. ఇక ఇప్పుడు మాత్రం ఆ స్టార్ హీరో ఆమెను ఎలా ? నమ్ముతాడు. దీంతో ఇప్పుడు ఎవ్వరూ పట్టించు కోకపోవడంతో ఆ ముదురు ముద్దుగుమ్మ ఇంకా ఒంటరిగానే ఉంటోందట.
ఇటు ప్రియుడు లేక.. అటు పెళ్లాడాలనుకున్నా.. పెళ్లిలేక సదరు స్టార్ హీయిన్ సతమతమవుతోంది. మరోవైపు వయస్సు ముదురుతోంది… పెళ్లి వయస్సు దాటుతోంది.. తనకంటూ జీవితంలో ఓ తోడు లేకపోవడంతో.. ఇప్పుడు తనకు ఉన్న తోడు (ఆ స్టార్ హీరో) అసలు పెళ్లి ఆలోచనలే లేని వాడు కావడంతో ఆమె అనుభవిస్తోన్న బాధ అంతా ఇంతా కాదట.
ఇప్పుడు ఈ హీరోయిన్ పడుతోన్న విరహ వేదన అంతా ఇంతా కాదని… ముంబై మీడియాలో గుసగుసలు వేడెక్కిస్తున్నాయ్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా.. కాస్త ఆలోచిస్తే మీరు ఈజీగానే గెస్ చేసేయొచ్చు.