ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు.. ఆపై స్నేహితులతో గ్యాంగ్‌ రేప్‌ చేయించాడు

యువతిని ఎంతగానో ప్రేమించాడు. పెద్దలను ఎదిరించి మరీ పెండ్లి చేసుకున్నాడు. నెలరోజులు తిరక్కుండానే వారి కొత్త కాపురంలో కలహాల కుంపట్లు చెలరేగాయి. భార్యను తీవ్రంగా కొట్టడంతో సదరు భార్య పోలీసులను ఆశ్రయించింది. అది మరింత దారుణానికి దారి తీసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్యపై కక్ష పెంచుకున్నాడు. స్నేహితులతో కలిసి గ్యాంగ్‌ రేప్‌ చేయించాడు. అందులో ఆ ప్రబుద్ధుడూ పాల్గొన్నాడు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం నవరంగాపూర్‌ జిల్లా ఉమ్మర్‌కోట్‌ ఠాణా పరిధిలోని చొడైగుడ గ్రామానికి చెందిన సజు హరిజన్‌ ఓ యువతిని ప్రేమించాడు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో వారిని ఎదిరించి ఇంటి నుంచి వెళ్లి పోయి మరీ పెండ్లి చేసుకున్నారు. వేరే చోట కొత్త కాపురాన్ని ప్రారంభించారు. నెలరోజుల పాటు సజావుగా సాగిన వారి సంసారంలో మనస్పర్ధలు పొడచూపాయి. ఈ క్రమంలో భార్యను కొట్టి ఇంటి నుంచి పంపించేందు సజు హరిజన్‌. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా, అధికారులు వారిద్దరికీ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇంటికి తిరిగి పంపారు.

భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందని మనసులోనే సజు హరిజన్‌ కక్ష పెంచుకున్నాడు. అదును కోసం చూస్తు ఉన్నాడు. ఓ రోజు భార్యను బయటకు తీసుకెళ్లాడు. రాత్రి పదిగంటల వరకు చెరువు కట్ట మీద తిరిగారు. అనంతరం స్నేహితులను పిలిచాడు. వారితో కలిసి భార్య చేతులను కట్టేశాడు. ఆమె ముఖానికి ముసుగు తొడిగాడు. వారితో అత్యాచారం చేయించాడు. ఆపై తను కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం భార్యను అక్కడే వదిలేసి స్నేహితులతో కలిసి వెళ్లిపోయాడు. ఒక రోజు తరువాత ఆపస్మారక స్తితిలోంచి బయటకొచ్చిన భార్య జరిగిన ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags: GANG RAPE, LOVE MARRIGE, NEW COUPLE, ODISHA STATE