సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి సినిమాల తర్వాత మహేష్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అటు అనిల్ రావిపూడికి కెరీర్లో ప్లాప్ అన్నదే లేదు. ఇక లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి దశాబ్ద కాలం తర్వాత ఈ సినిమాతో మళ్లీ వెండితెరపై దర్శనం ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే సరిలేరుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ భారీ అంచనాలకు తగ్గట్టుగానే సంక్రాంతి క్రేజ్ యాడ్ అవ్వడంతో సరిలేరుకు కేవలం థియేట్రికల్ బిజినెస్సే రు.100 వరకు జరుగుతోంది. నైజాం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మహేష్ కెరీర్లోనే టాప్ రేటుకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయంటున్నారు.
పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. టీజర్ వచ్చాక సినిమాకు మరింత హైప్ రావడం విశేషం. ఇక రు.100 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంటే… ఇక ఓవర్సీస్, డిజిటల్ హక్కులు, శాటిలైట్ హక్కులు, హిందీ డబ్బింగ్ హక్కులన్నీ కలిపితే రు. 175 కోట్లకి పైగా మార్కెట్ జరగనుంది.
ఈ సినిమా జనవరి 11న రిలీజ్ అవుతుంటే.. ఆ మరుసటి రోజే త్రివిక్రమ్ – అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా కూడా దిగుతోంది. సంక్రాంతికి ఒక్క రోజు తేడాలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు వస్తుండడంతో రెండు సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాల్లో ఎవ్వరు పైచేయి సాధిస్తారో ? చూడాలి.