ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు గత నెల రోజులుగా రాజధాని అమరావతి చుట్టూనే తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది మొదలు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడేక్కెంది. అధికార, పత్రిపక్ష నేతల పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి మద్దతుగా ఒకరు, వ్యతిరేకంగా మరొకరు ర్యాలీలు, ధర్నాలను నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు జోలెపట్టుకుని చందాలు వసూలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా అమరావతిని తరలించవద్దని కోరుతూ రాజధాని ప్రాంత రైతులు నిరవధికంగా దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. అవి శనివారం నాటికి 32వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా తుళ్లూరు, మందడం వద్ద నిర్వహించిన మహాధర్నాకు రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు భారీగా తరలివచ్చి నిరసన తెలిపారు. వెంటనే మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ”ప్రాణాలైనా అర్పిస్తాం.. అమరావతి రాజధానిని సాధిస్తాం” అంటూ ప్రతిన బూనారు. నిరవధికంగా దీక్ష చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని రైతులు, మహిళలు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.