పవన్‌ ‘పింక్‌’ సినిమాకు పసుపు మరకలు

సుదీర్ఘ విరామం తర్వాత జనసేన అధినేత, టాలివుడ్‌ అగ్రహీరో పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న కొత్త సినిమా రాజకీయ రంగును పులుముకుంటుంది. బాలివుడ్‌లో సంచలనం రేపి సూపర్‌ హిట్టయిన పింక్‌ సినిమా టాలివుడ్‌లో పసుపు మరకలను అంటించుకుంటున్నది. నిర్మాణ దశలోనే విమర్శలను ఎదుర్కొంటున్నది. పవన్‌కు కొత్త చిక్కులు తీసుకొస్తున్నది. బోనీకపూర్‌, దిల్‌ రాజు సంయుక్త నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఎంసీఏ ఫేమ్‌ వేణు శ్రీరామ్‌ దర్వకత్వంలో తెలుగులో ఈ సినిమా రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే.. బాలివుడ్‌లో తాప్సి ప్రధాన పాత్ర పోషించగా, దిగ్గజ నటుడు అమితా బచ్చన్‌ కీలక న్యాయవాది పాత్రను పోషించి మెప్పించారు. తెలుగులో అమితాబ్‌ పాత్రను పవన్‌ పోషించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే మొదలైంది. ఆ షూటింగ్‌ స్పాట్‌లో బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ డ్రెస్‌లో, గుబురు గడ్డంతో నడుచుకుంటు వెళ్తున్న పవన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. లాయర్‌ సాబ్‌ ఆన్‌ డ్యూటీ అనే ప్రచార టైటిల్‌ పేరిట చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉండగా ఆ చిత్రంలో పవన్‌ నడుచుకుంటూ వెళ్తున్న సీన్‌లో కొద్దిగా మూలకి చంద్రబాబు హెరిటేజ్‌ బోర్డు దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. దీనిని వైసీపీ నేతలు ట్రోల్‌ చేస్తున్నారు. ఇక్కడ కూడా నీ బాస్‌ ఫుడ్‌ను ప్రమోట్‌ చేస్తున్నావా పవన్‌ నాయుడు అంటూ కామెంట్లు పెడుతూ ఆ ఫొటోను షేర్‌ చేస్తున్నారు. నీ బానిసత్వాన్ని నిరూపించుకున్నావ్‌ అంటూ ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు. పనిలో పనిగా దానికి గతంలో ”జగన్‌ అద్భుతంగా పరిపాలిస్తే నేను పోయి సినిమాలు చేసుకుంటా” అని పవన్‌ చేసిన ప్రకటన తాలుకు క్లిప్పింగ్‌లను సైతం జోడించడం విశేషం.

Tags: chandrababu, heritage food, pawan kalyan pink movie