క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం నిశ్శబ్ధం. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు చిత్రానికి సంబంధించిన మరో లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే చిత్ర ప్రమోషన్‌ను సైలెంట్‌గా చేపట్టి విజయవంతంగా ముందుకు సాగుతున్న ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు అందరికి అదిరిపోయే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.
హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సెన్ కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. నిశ్శబ్ధం చిత్రంలో మైఖేల్ ఓ ఫవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఓ క్రైం కేసును చేధించే క్రమంలో అనుష్క పాత్ర ఏ మేరకు ఈ కేసులో ఇన్‌వాల్వ్ ఉందనే కోణంలో మైఖేల్ పరిశోధన చేయబోయే పాత్రాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మైఖేల్ పాత్ర రిచర్డ్ డికెన్స్.
మైఖేల్ మ్యాడ్సెన్ పాత్ర ఇందులో ఎంతో విలక్షణంగా ఉంటుందని చిత్ర యూనిట్ అభిప్రాయం. ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి, మాధవన్ నటిస్తున్నారు. క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ హాలీవుడ్ నటుడు నటించడం విశేషం. అయితే మైఖేల్ మ్యాడ్సెన్ పై విడుదల చేసిన లుక్‌లో ఎంతో హుందాగా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన మైఖేల్ ఇప్పుడు నిశ్శబ్ధం చిత్రానికి హైలెట్ కానున్నాడు. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కానున్నది.