నా రాజకీయ భవిష్యత్తు నాశనమైన జగన్‌ వెంటే ఉంటా

ౖమంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దుమారం రేపుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ పెద్దలను ఇరకాటంలో పడేశాయి. ఏపీ అసెంబ్లీ సమావేశంలో మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై ఆసక్తికర చర్చ సాగింది. ఈ సందర్భంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుతో తనకు రాజకీయ భవిష్యత్‌ లేకపోయినా తాను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వెంటే ఉంటానని ప్రకటించి అటు అధికారపార్టీ నేతలను, ఇటు విపక్షపార్టీ నేతలను ఆశ్చర్యంలో ముంచెత్తారు.

”ఇన్‌ జగన్‌ వీ ట్రస్ట్‌” పేరుతో ఫ్లకార్డును ప్రదర్శిస్తూ ఆయన చేసిన ఈ ప్రసంగం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించిన అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను పూర్తిగా సమర్థిస్తున్నానని ప్రకటించారు. దానితో తనకు రాజకీయ భవిష్యత్‌ లేకుండా పోయినా ఫర్వాలేదని, తాను మాత్రం సీఎం జగన్‌ వెంటే ఉంటానని స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో ఓడిపోతే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతానని ఆయన ముక్తియింపునివ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా ఆర్కే ప్రసంగం సాగుతున్నంతసేపు సీఎం జగన్‌ ఆయనను తదేకంగా చూడడం విశేషం.

Tags: amaravathi capital, ap cm jagan, mangalairi mla alla ramkrishnareddy