హైదరాబాద్ శివారులో గత ఐదు రోజుల క్రితం జరిగిన పశువైద్యాధికారి డాక్టర్ ప్రియాంకరెడ్డి దుర్ఘటన ఓ దురదృష్టకరమైనది. అయితే ఈ సంఘటన ఓ సినిమాపై ప్రభావం పడింది. ఆ దుర్ఘటన జరిగి ఉండకపోతే.. ఆ సినిమా అప్పుడే ఓపెనింగ్ జరిగిపోయేది.. కానీ అనుకోని అవాంతరం వచ్చి పడటంతో ఈ సినిమా కార్యక్రమం ఆగిపోయింది. ఇంతకు ప్రియాంకరెడ్డి దుర్ఘటనతో ఆగిపోయిన సినిమా ఏమై ఉంటుంది అనుకుంటున్నారా.. ఎవరిదై ఉంటుంది అనుకుంటున్నారా..?
టాలీవుడ్ లో ఓరేంజ్ ఉన్న హీరో నేచురల్ స్టార్ నానీ. నానితో సినిమా అంటే అది మ్యాగ్జిమమ్ గ్యారెంటీ సినిమా. నానీతో సినిమా చేస్తే లాభాలు బాగా రాకున్నా మంచిదే కానీ… నష్టాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావనే గట్టి నమ్మకం దర్శక నిర్మాతలది. అందుకు నానీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. ఇప్పుడు నానీ హీరోగా తెరకెక్కబోతున్న ఓ చిత్రానికి ఓ విచిత్రమైన టైటిల్‌ను ఖరారు చేయబోతుంది చిత్ర యూనిట్. వాస్తవానికి ఈ టైటిల్ వింటే ప్రతి ఒక్కరు విచిత్రంగా చూస్తారు.
నేచురల్ స్టార్ నానీ నటించబోయే చిత్రంకు దాదాపుగా టక్ జగదీష్ అనే టైటిల్ ఖరారు అయింది. నాని హీరోగా, శివనిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా పైనల్ అయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్లు వీరేనని, సినిమా లైన్ ఇదేనని, ఇలా ప్రతి అప్ డేట్ ను ఎక్స్ క్లూజివ్ గా సోషల్ మీడియాలో వస్తునన్నాయి. అయితే ఇంతకాలం వస్తున్న ప్రచారంకు ఈ టైటిల్ ఖరారుతో శుభం కార్డు పడింది. ఈ సినిమా ప్రియాంక సంఘటనతో ఓపెనింగ్ ఆగిపోయింది. అయితే జనవరిలో సినిమాను ప్రారంభించబోతున్నారు. అయితే ఈసినిమాకు అఫీషియల్‌గా టైటిల్ ఈ రోజు ఉండబోతుంది. ఈ సినిమాలో నానీ కి ఓ అన్న, ఓ తమ్ముడు ఉంటాడని, మద్యలో ఉండే నాని జగదీష్ గా నటిస్తాడు.. అయితే నిత్యం టక్ చేసే ఇతడికి టక్ జగదీష్గా నిక్‌నేమ్ పెడతారు స్నేహితులు. . అలా ఈ సినిమాకు టక్ జగదీష్గా టైటిల్ ఖరారు చేసినట్లు టాక్.