లెక్కలేనని సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకేంద్రుడు.. ఎన్నో అపురూపమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకడు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను టాలీవుడ్‌కు అందించినవాడు. ఎందరో హీరోలకు, హీరోయిన్లకు చిత్ర సీమకు పరిచయం చేయడమే కాకుండా.. వారికి జీవితాన్ని ఇచ్చిన ఈ అగ్ర దర్శకుడికి ఓ తీరని కోరిక తీరే దారి కనిపించడం లేదు. ఎన్నో కలలు కన్న ఈ కలల ప్రాజెక్టుకు గ్రహణం పట్టిందని ప్రచారం జరుగుతుంది.
ఇంతకు ఈ దర్శకేంద్రుడు ఎవ్వరు.. ఆయన కలలు కన్న ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏమిటీ అనుకుంటున్నారా..? ఈ అగ్ర దర్శకుడు కె.రాఘవేంధ్రరావు. ఆయన కలలు కన్న ప్రాజెక్టు ఏంటంటే.. మూడు కథలు.. ముగ్గురు దర్శకులు.. ముగ్గురు హీరోయిన్లు.. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా భాగమయ్యారు. కానీ ఎందుకో ముందుకు సాగడం లేదు..
అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ముగ్గురు దర్శకుల్లో ఇద్దరు దర్శకులు రెడి అయ్యారు.. ఒకరు క్రిష్.. మరొకరు నక్కిన త్రీనాథరావు. హీరో గా నాగశౌర్యను అనుకున్నారు. ఇక ప్రాజెక్టు పట్టాలెక్కడమే తరువాయి.. కానీ ప్రాజెక్టుకు మద్యలోనే బ్రేక్‌లు పడ్డాయి.. ఇందులో దర్శకుడు క్రిష్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే పనిలో బిజిగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఇక మిగతా నటీనటులు, టెక్నిషియన్లు కొన్ని సినిమాలతో బిజిగా ఉండటంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని సమాచారం. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును భావించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆశలు తీరేలా కనిపించడం లేదు. మరి రాఘవేంద్రరావు భవిష్యత్‌లో ఈ ప్రాజెక్టు కోసం ఎలాంటి ముందడుగు వేస్తారో వేచి చూడాల్సిందే.