దూషించినవారికే జగన్‌ పదవులిచ్చారు

ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నారు పెద్దలు. నిజమే చాలా విషయాల్లో అలాగే జరుగుతుంటుంది. ఎక్కడయితే అదే కొనసాగుతుంది. ఇక రాజకీయాల్లోనైతే మరీను. కొందరు ఉండబట్టలేక పైకి అనేస్తుంటారు. ఇప్పుడు అధికార వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే సీఎం జగనపై చేసిన అలాంటి వ్యాఖ్యలే దుమారం రేపుతున్నాయి. పార్టీలోని లుకలుకలను బహిర్గత పరుస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఏపీ రాజకీయాల్లో రచ్చనీయాంశంగా మారాయి. నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపూసల ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి వైసీపీని స్థాపించినప్పటి నుంచి జగన్‌ వెంటే ఉంటున్నారు. ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత మంత్రి పదవిని ఆశించారు. అయినా ఆయనకు జగన్‌ ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేదు. ఇదిలా ఉండగా తాజాగా తన ఆవేదనను పార్టీ కార్యకర్తలు, అనుచరులతో ఆయన పంచుకున్నారు. మొదటి పార్టీలో ఉన్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. తన వెనకవచ్చిన నేతలకు, అసభ్యకరంగా దూషించిన బొత్స సత్యనారాయణ లాంటి వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారని సీఎం జగన్‌పై రుసరుసలాడారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో లీకయ్యాయి. ఇప్పుడివి వైరల్‌గా మారాయి. వైసీపీలో కాక రేపుతున్నాయి. ఇంకెంత మంది ఇలాంటి అసంతృప్త నేతులున్నారో? అని ఆందోళన తెప్పిస్తున్నది.

Tags: cm jaganmohanreddy, minister botsa, ycp mla prasannkumar