టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా, చిత్రాల పంపిణిదారుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన దిల్ రాజుకు ఇప్పుడు చెప్పలేని కష్టం వచ్చింది. కష్టం అంటే అట్లాంటి ఇట్లాంటి కష్టం కాదు.. తాను చేయబోయే పింక్ సినిమా ఈ కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ పింక్ సినిమా రీమేక్ హక్కులు కొన్నప్పటి నుంచి దిల్ రాజుకు సమస్యలు చుట్టుముడుతున్నాయి. వాస్తవానికి దిల్ రాజు పింక్ సినిమా కొన్నప్పటి నుంచి సినిమా ప్రారంభిస్తే ఇప్పటికే సినిమా పూర్తి అయిపోయేది..
కానీ పింక్ సినిమాలో ప్రముఖ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తాడనే ఆశతో దిల్ రాజు ఉన్నాడు. అందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడని దిల్ రాజు అనేకసార్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా రీమేక్‌కు దాదాపుగా 30రోజులకు పైగా డేట్స్ ఇచ్చాడని, దాదాపు రోజుకు కోటి రూపాయల పారితోషికంతో పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ గరం గరం అయ్యారు. అయితే పింక్ సినిమాలో పవన్ కళ్యాణ్ తప్పక నటిస్తాడని భారీ నమ్మకంతో ఉన్నప్పటికి ఇప్పుడు పెద్ద సమస్య దిల్ రాజుకు వచ్చి పడింది.
దిల్ రాజు పింక్ రీమేక్ హక్కులు కొనుగోలు చేశాడు. ఈ రీమేక్ సినిమాను దిల్ రాజు తన ఆస్థాన దర్శకుడు వేణు శ్రీరామ్‌తో దర్శకత్వ్ం చేయించాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. పవన్ కళ్యాణ్ దిల్ రాజు పింక్ రీమేక్ సినిమాలో నటించాలంటే దానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అడ్డుగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్‌కు త్రివిక్రమ్ ప్రాణస్నేహితులు. అయితే పింక్ రీమేక్ లో పవన్ నటించాలంటే త్రివిక్రమ్ డైరెక్షన్ చేయాల్సి వస్తుందని దిల్ రాజు ఆలోచన. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ప్రాజెక్టు అప్పగిస్తే హరిని హాసిని క్రియోషన్‌కు భాగస్వామ్యం కల్పించాల్సి వస్తుంది.
పవన్ కళ్యాణ్ నటించాలంటే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కావాలి.. అలా కావాలంటే నిర్మాణంలో భాగస్వామ్యం ఇవ్వాలి.. వేణు శ్రీరామ్‌ను తీసుకుంటే.. పవన్ ఎక్కడ మెలిక పెడుతాడో.. పవన్ మెలిక పెడితే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్‌ను దూరం పెట్టాలంటే పవన్‌తో సినిమా వదులుకోవాలి.. పవన్‌తో సినిమా చేయాలంటే.. త్రివిక్రమ్‌ను తీసుకోవాలి.. వేణు శ్రీరామ్‌తో సినిమా చేస్తే ఇద్దరు దూరమవుతారు.. ఇప్పుడు ఏమి చేయాలో దిల్ రాజుకు తోచడం లేదు. ఈ కష్టం నుంచి దిల్ రాజు గట్టేకెదెట్ట అనేది ప్రశ్నగా మారింది. మరి పవన్ కళ్యాణ్ దిల్ రాజును ఏమీ చేస్తాడో.. ఏమో..