దిల్‌ రాజుకు సీరియస్‌ క్లాస్‌పీకిన పవన్‌కల్యాణ్‌

అగ్రనిర్మాత దిల్‌ రాజుకు జనసేన అధినేత, హీరో పవన్‌కల్యాణ్‌ సీరియస్‌ క్లాస్‌ పీకారు. కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారట. ఇప్పుడీ విషయం తెలుగు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ విషయమేమిటంటే సుదీర్ఘ విరామం తర్వాత పవన్‌కల్యాణ్‌ తిరిగి సినిమాలకు రీ ఎంట్రీ చేసిన విషయం తెలిసిందే. బాలివుడ్‌లో సంచలనం రేపి సూపర్‌ హిట్టయిన పింక్‌ సినిమాను బోనీకపూర్‌, దిల్‌ రాజు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఎంసీఏ ఫేమ్‌ వేణు శ్రీరామ్‌ దర్వకత్వంలో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. హిందీలో అమితాబ్‌బచ్చన్‌ పోషించిన కీలక న్యాయవాద పాత్రను తెలుగులో పవన్‌ పోషించనున్న సంగతి విధితమే. ఆ మొత్తానికి హీరో 20 రోజుల డేట్లను మాత్రమే ఇచ్చాడు. ఇటీవలే మంచి ముహూర్తం చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఆయన షూటింగ్‌లో పాల్గొన్నాడు.

అంతవరకు బాగానే అసలు చిక్కులు అక్కడే మొదలయ్యాయి. ఆ షూటింగ్‌ స్పాట్‌లో బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ డ్రెస్‌లో, గుబురు గడ్డంతో నడుచుకుంటు వెళ్తున్న పవన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. లాయర్‌ సాబ్‌ ఆన్‌ డ్యూటీ అనే ప్రచార టైటిల్‌ పేరిట చక్కర్లు కొడుతున్నాయి. అదేవిధంగా పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు రాజధాని అమరావతిపై రాద్దాంతం జరుగుతుంటే బాధ్యతగల రాజకీయ నేతగా ఉండి సినిమాలు చేసుకోవడమేంటని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చురకలంటిస్తున్నారు. అదీగాక  ఆ ఫోటోలో నడుచుకుంటూ వెళ్తున్న పవన్‌కు పక్కగా చంద్రబాబు హెరిటేజ్‌ బోర్డు దర్శనమివ్వడంతో దానిని వైసీపీ నేతలు ట్రోల్‌ చేస్తున్నారు. ఇక్కడ కూడా నీ బాస్‌ ఫుడ్‌ను ప్రమోట్‌ చేస్తున్నావా పవన్‌ నాయుడు అంటూ కామెంట్లు పెడుతూ ఆ ఫొటోను షేర్‌ చేస్తున్నారు. నీ బానిసత్వాన్ని నిరూపించుకున్నావ్‌ అంటూ ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో అసలు ఆ ఫొటోలు బయటకు ఎలా వచ్చాయి? అని నిర్మాత దిల్‌రాజుపై అగ్రహం వ్యక్తం చేశారట. అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? అని క్లాస్‌ పీకారట. ఇకెనైనా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారట. మరోసారి ఇలాంటివి జరిగితే క్షమించేది లేదని రుసరుసలాడట. తన షూటింగ్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటనలు ఇవ్వవద్దని, షూటింగ్‌ స్పాట్‌కు వచ్చేంత వరకూ చిత్రయూనిట్‌ ఎవరకీ ఏ విషయాలు చెప్పవద్దని సూచించాడని టాలివుడ్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇక అదేమోకానీ అసలు పవన్‌ రీఎంట్రీ ఇవ్వడమే బ్యాడ్‌టైంలో ఇచ్చాడని పలువురు సినీ పెద్దలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

Tags: Dil Raju, Pawan kalyan, pink remake shooting photos