మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలీష్స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే టాలీవుడ్ లో క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం అలా వైకుంఠపురములో.. ఈ సినిమా ప్రారంభమైంది.. సినిమా నిర్మాణం కూడా పూర్తి అయింది అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ అగమేఘాల మీద ఎంతో చాకచక్యంగా నిర్మాణం పూర్తి చేసి, నిర్మాణాంతర కార్యక్రమాల వైపు దూసుకుపోయింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురంలో. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు సాంగ్స్ ను రిలీజ్ చేశారు. మరోవైపు డబ్బింగ్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఓవైపు నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటూనే మరోవైపు చిత్ర ప్రమోషన్ కూడా ఎంతో వ్యూహాత్మకంగా కానిచ్చేస్తున్నారు. బన్నీ తన డబ్బింగ్ పనులను పూర్తి చేసుకుంటున్నట్లు చిత్ర పరిశ్రమలో టాక్.
ఈ చిత్రంలోని నటీనటులు మురళీ శర్మ, పూజా హెగ్డేలు గత రెండు రోజులుగా డబ్బింగ్ చెప్తున్నారు. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అలా వైకుంఠపురములో సినిమా ప్రమోషన్ ఇప్పటికే ఇరగదీస్తున్న ఈ చిత్ర యూనిట్ మరింత దూకుడుగా ప్రమోషన్ చేయనున్నది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పూర్తి కాగానే బన్నీ సుకుమార్ సినిమా మొదలౌతుంది. దాదాపుగా వచ్చే నెల నుంచి సుకుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. సుకుమార్ సినిమాను సమ్మర్ కు రిలీజ్ చేయాలని బన్నీ లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందులో రష్మిక మందన్న హీరోయిన్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్నది.