తొలిసారిగా ఓవర్సిస్‌లో బన్నీ రికార్డుస్థాయి కలెక్షన్లు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన అలవైంకుఠపురంలో సినిమా జైత్రయాత్ర కొనసాగుతున్నది. విడుదలై వారంలోనే అన్ని రికార్డులను చెరిపేస్తూ ముందుకు సాగుతున్నది. ఇంటా బయటా కలెక్షన్లను కొల్లగుడుతున్నది. బన్సీ కెరీర్‌లోనే కలెక్షన్ల పరంగా బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తున్నది. ఓవర్సీస్‌లో మొదటిసారిగా బన్నీ రికార్డుస్థాయి కలెక్షన్లను నమోదు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలుపుతున్నాయి.

సంక్రాంతికి ఒకరోజు ముందు 12వ తేదీన విడులైన ఈ సినిమా పాటిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తున్నది. తమన్‌ అందించిన సామజవరగమణ, రాములో రాములో పాటలు సినిమాకు హైలట్‌గా నిలుస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టింది ఈ సినిమా. నాన్‌ బాహుబలి రికార్డులన్నింటినీ తిరగరాసింది. అదేవిధంగా ఓవర్సిస్‌లోనూ విజయవంతంగా దూసుకెళ్తున్నది. అక్కడ ప్రిమియర్స్‌, ఫస్ట్‌ డే కలెక్షన్లతో ఒక మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేసిన ఈ సినిమా ఆరు రోజుల్లోనే 2 మిలియన్ల మార్క్‌ను దాటింది. ఆ మొత్తం బన్నీ కెరీర్‌లోనే మొదటి సారని ట్రేడ్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదీగాక అలవైకుంఠపురంలో కన్నా ఒకరోజు ముందు వచ్చిన మహేష్‌బాబు సరిలేరునీకెవ్వరు చిత్రం రికార్డులను సైతం ఓవర్సీస్‌లో ఈ చిత్రం బ్రేక్‌ చేసింది. వారం రోజుల్లోనే ఈ మొత్తం వసూలు చేసిన ఈ సినిమా ముందు ముందు మరెన్ని రికార్డులను బ్రేక్‌ చేస్తుందోనని టాలివుడ్‌ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

Tags: ala vykuntapurmlo, allu arjun, oversis boxoffice collections, thrivikram