నటీనటులు : సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ శరత్‌కుమార్, అయ్యప్ప శర్మ, రఘుబాబు, సప్తగిరి, వెన్నెల కిషోర్ తదితరులు.
దర్శకత్వం : నాగేశ్వర్‌రెడ్డి జి.
నిర్మాణ సంస్థ : ఏజీ నాగేశ్వర్‌రెడ్డి ఎంటర్టైనర్
నిర్మాతలు : సంజీవరెడ్డి, నాగభూషణ్‌రెడ్డి, ఇందుమూరి శ్రీనివాస్, రూప జగదీష్.
సంగీతం : సాయి కార్తిక్.
ఎడిటింగ్ : చోటా కే నాయుడు
విడుదల తేది : 15/11/2019
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో విజయం అందుకున్న సందీప్ కిషన్ తరువాత వరుస పరాజయాలతో సతమతమవుతున్న తరుణంలో వచ్చిన సినిమా తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్. ఈ సినిమాకు ముందు వచ్చిన నిను వీడను నీడను నేనే అనే సినిమాకు కూడా సందీప్‌కు మంచి పేరును తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు వచ్చిన ఈ సినిమాతో సందీప్ కిషన్ కు బూస్టింగ్ లభించినట్లే.. అయితే ఈ సినిమాను ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో ఓసారి చూద్దాం.
కథ : ఓ జర్నలిస్టు మానవీయ కథనాలు రాయడం, రాజకీయ నేతల అవినీతి అక్రమాలను వెలికితీయడం వంటి పరిశోధాత్మక కథనాలు రాస్తుంటాడు. అయితే కర్నూలులో ఓ బలమైన రాజకీయ నేతగా ఎదగాలి అనుకున్న వరలక్ష్మీకి చేస్తున్న అక్రమాస్తులకు సంబంధించి.. ఆధారాలు సేకరించిన ఓ జర్నలిస్ట్‌ను హత్య చేస్తుంది. ఆ హత్య కేసు నుంచి బయట పడేందుకు ఈ హత్య తన ప్రత్యర్థులు చేశారని నిరూపించేందుకు ఓ సీనియర్ క్రిమినల్ లాయర్ చక్రవర్తిని ఎంపిక చేసుకుంటుంది. ఈ లాయర్‌కు ఓ అందాల కూతురు ఉంటుంది. ఆమే రుక్మిణి. ఈమెను తెనాలి రామకృష్ణ ( సందీప్‌కిషన్) ప్రేమిస్తాడు. వరలక్ష్మీ ఎంపిక చేసుకున్న లాయర్ ప్రత్యర్థులతో చేతులు కలపడం, దీంతో వరలక్ష్మీని జైలుకు పంపాలను కోవడం, ఇది తెనాలి రామకృష్ణ తెలుసుకోవడంతో పాటు తరువాత కథ ఎలా మలుపులు తిరిగి వరలక్ష్మీ జైలుకు వెళ్ళిందా.. లేక కేసు నుంచి బయట పడిందా అనేది తెరమీద చూడాలి.
నటీనటులు: హీరో సందీప్ కిషన్ దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డికి దొరికిన ఓ యువ అణిముత్యం అని తన నటనతో నిరూపించాడు. నూటికి నూరుపాళ్లు తన నటనను చూపాడు సందీప్ కిషన్. ఈ సినిమాలో హీరోయిన్ హన్సికలతో చేసిన ప్రేమ రోమాన్స్ బాగా ఉంది. హన్సిక తన గ్లామర్‌తో ఎప్పటిలాగే ప్రేక్షకులను మెప్పించింది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ తనదైన శైలీలో నటించింది. మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళీ, రఘుబాబు, అశోక్ కుమార్, ప్రదీప్ కుమార్ తదితరులు బాగా నటించారు. వెన్నెల కిషోర్, సప్తగిరి, చమ్మక్ చంద్ర కామెడీతో సినిమాకే హైలెట్‌గా నిలిచారు.
సాంకేతిక నిపుణులు : డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఇప్పటి వరకు కామెడీ చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల మదిని దోచుకున్నాడు. ఇప్పుడు కూడా కామెడిని నమ్ముకుని ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమాలో ఎక్కువగా కామెడీతో ప్రేక్షకుల మదిని దోచినట్లే. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మంచి సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ తన కెమెరా పనితనంతో సినిమాకు మరింత అందాలను తెచ్చిపెట్టిండనే చెప్పవచ్చు.
చివరిగా : హీరో సందీప్ కిషన్ కేరీర్‌కు ఇప్పుడు వరుసగా రెండు మంచి సినిమాలు వచ్చాయనే చెప్పవచ్చు. ఇటీవల వచ్చిన నిను వీడను నీడను నేను, ఇప్పుడు తెనాలి రామకృష్ణ. ఈ సినిమాలతో సందీప్ కిషన్ యువ హీరోలతో పోటీలో ఉన్నట్లే. సినిమా అసాంతం ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా నవ్వుకుని, థియోటర్ నుంచి ఓ మంచి నవ్వుముఖంతో ఇంటి బాట పట్టెసేలా ఉంది సినిమా. ప్రేక్షకులకు ఓ కామెడీ సినిమాను దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి అందించాడు.
రేటింగ్ : 3/5