తమిళ హిరో విజయ్‌కు తెలుగు మార్కెట్‌ ఎంతో తెలుసా?

తమిళ్‌స్టార్‌ హీరో ఇలయదళపతి విజయ్‌ సినిమాలు తెలుగులోకి తెగ అనువాదమవుతున్నాయి. టాలివుడ్‌లో పవన్‌కల్యాణ్‌కు ఉన్నంత స్టార్‌డమ్‌ కొలివుడ్‌లో విజయ్‌కు ఉంది. అబిమానులు ఆయనకు గుడులు కట్టారు. అదీగాక కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ దిగ్గజ హీరోలు ఉన్నా విజయ్‌ తనంటూ తమిళ సినీ పరిశ్రమలో ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. రెండు దశాబ్దాలుగా తమిళ సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపుతున్నారు. అయినప్పటికీ విజయ్‌ సినిమాలు చాలా తక్కువగా తెలుగులోకి అనువాదమవుతూ వస్తున్నాయి. చాలా కాలం కిందటి వరకు విజయ్‌ తెలుగు తెరకు పరిచయం లేని ముఖంగానే ఉన్నాడు. ఇటీవల కాలం నుంచే ఆయన సినిమాలు విరివిగా విడుదలవుతున్నాయి. తుపాకీ, సర్కారు, విజిల్‌ తదితర చిత్రాలు తెలుగులోనూ మంచి ఆదరణ పొంది వసూళ్లను రాబట్టాయి. ఆ సినిమాలతో తెలుగు విజయ్‌ మార్కెట్‌ స్థాయి గతంతో పోల్చితే ఎంతో గొప్ప స్థాయికి చేరింది. విజయ్‌కు సంబంధించి తెలుగులో మార్కెట్‌ రూ. 10కోట్లకు మించిపోయిందని సినీవర్గాలు వివరిస్తున్నాయి.

ఇదిలా ఉండగా విజిల్‌ సినిమాంతో మంచి ఫలితం అందుకు న్న పీఆర్వో టర్న్డ్‌ నిర్మాత మహేష్‌కోనెరు ఇక నుంచి వరుసగా విజయ్‌ సినిమాలను తెలుగు హక్కులను కొనేయాలని నిర్ణయించకున్నారట. ఇప్పటికే విజయ్‌ తర్వాతి సినిమా మాస్టర్‌ హక్కులను సైతం ఇప్పటికే దక్కించుకున్నారట. ఇప్పుడిదే టాలివుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఖైదీ, నగరం లాంటి వైవిధ్యభరితమైన సినిమాలు తీసిన లోకేష్‌ కనకరాజ్‌ ఈ మాస్టర్‌ చిత్రాన్ని తీస్తుండడమూ ఓ కారణమట. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదీగాక విజయ్‌ మార్కెట్‌ రేంజ్‌ పెరిగిపోవడమూ మరో కారణమట. ఏదేమైనా, ఎవరి మార్కెట్‌ పెరిగినా పెరగకపోయినా సినిమా హిట్టయితే చాలు. టిక్కెట్టు కొనుక్కొని హాలుకు వెళ్లిన ప్రేక్షకుడు నిరాశచెందగా వెనుతిరిగితే చాలు. ఆ సినిమా హిట్టన్నటే.

Tags: tamil hero vijay, thupaki movie, tollywood market range