వరుసగా ప్లాపులు పలకరిస్తున్నా మాస్మహరాజా మార్కెట్ మా్త్రం ఏ మాత్రం పడిపోలేదు. థియేటర్లు తక్కువ సంఖ్యలో ఉన్నా పెద్ద సినిమాలతో పోటీ పడుతూ మరీ కలెక్షన్లను రాబడుతున్నది. హీరో రవితేజ, విలక్షణ దర్శకుడు వీఐ ఆనంద్ కాంబీనేషన్‌లో రూపొందిన డిస్కో రాజ సినిమా శుకవ్రారం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమాలో ముగ్గురు హిరోయిన్లు నబా నటేష్, ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్, తాన్యహోప్, బాబీ సింహా నటించగా, తమన్ సంగీతం సమకూర్చాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో లేకున్నా బాక్సాఫీసు వద్ద కాసులను మాత్రం రాల్చుతున్నది. ప్రీరిలిజ్కు ముందే భారీ మొత్తంలో కొల్లగొట్టిన సినిమా అదే పరంపరంను కొనసాగిస్తున్నది టాలివుడ్ ట్రేడ్‌వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుతం తెలుగు రాష్ర్టల్లో ఎక్కువ మొత్తం థియేటర్లలో అలవైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు సినిమాలే కొనసాగుతున్నాయి. దీంతో డిస్కోరాజా సినిమా సింగిల్ థియేటర్లకు అది, తక్కువ సంఖ్యలో సర్దుకుపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ రవితేజ సినిమా భారీ వసూళ్లను చేస్తుండడం గమనార్హం. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 5కోట్లను షేర్ చేసిందని టాలివుడ్ ట్రేడ్‌వర్గాలు వెల్లడిస్తున్నాయి. అందులో ఒక్క నైజాంలోనే రూ.1.5 కోట్లను రాబట్టగా, మిగతా ఆంధ్ర, సీడెడ్‌లో రూ.2కోట్లను కొల్లగొట్టింది. వరుసగా ప్లాపులు పలకరిస్తున్నా ఈ మొత్తంలో వసూలు చేస్తుండడంపై టాలివుడ్ వర్గాలు ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నాయి. ప్రపంచం వ్యాప్తంగా ఈ సినిమా ప్రీరిలీజ్ ద్వారా సుమారు రూ. 22 కోట్లను రాబట్టింది. అందులో నైజాంలో 6, వైజాగ్, 1.95, తూర్పు 1.25, వెస్ట్‌గోదావరి 1.5, కృష్ణ 1.25, గుంటూరు 1.50. నెల్లూరు 0.65, ఇతర చోట్ల రూ. 2.75 మొత్తంగా ఏపీ, తెలంగాణ ఏరియాల్లో 16. 4 కోట్లు రాబట్టిందని అంచనా. ఇక ఓవర్సీస్లో 1.50, కర్ణాటకలో 1.10, ఇతర అన్ని ప్రాంతాల్లో .50 కోట్ల బిజినెస్ చేసిందని ట్రేడ్‌వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఈ సినిమా ఇప్పటికే 22 కోట్లను రాబట్టింది.