ధర్మసూర్య సమర్పణలో వస్తున్న చిత్రం జోహార్. ఈ చిత్రంకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని సందీప్ మర్ని నిర్మిస్తుండగా, తేజ మర్ని దర్శకత్వంలో సినిమాను రూపొందిస్తున్నారు. చిత్రానికి సంగీతం ప్రియదర్శిని అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఓ జీవిత కథ ఆధారంగా వస్తున్నట్లు పోస్టర్‌పై ప్రకటించింది చిత్ర యూనిట్.
జోహార్ సినిమా పాతకాలం నాటి ఇతివృత్తాన్ని నేపథ్యంగా తీసుకుని తెరకెక్కిస్తున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. పోస్టర్‌పై ఓ వృద్ధుడు, ఓ జంట పరుగెత్తున్న దృశ్యాన్ని.. ఓ తల్లి తన బిడ్డను ఆప్యాయంగా ఎత్తుకుని మురిసిపోతున్న తీరు ఓ బాలిక ఎంతో ధీనంగా కూర్చున్న దృశ్యం.. పోస్టర్‌పై ఓ వ్యక్తికి చెందిన కాళ్ళను ప్రధానంగా పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
చిత్రం త్వరలో వస్తుందని ప్రకటించారు కానీ చిత్ర విశేషాలను మాత్రం ప్రకటించలేదు. అంతే కాదు చిత్ర నటీనటులను ప్రకటించలేదు. ముందుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్రం పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఏదేమైనా ఈపోస్టర్తో చిత్రంపై ఓ అంచనా వచ్చేలా చేసింది చిత్ర యూనిట్.