తానోటి తలిస్తే దైవమొకటి తలిచిందంటే ఇదే మరి. రాజకీయంగా వైసీపీని ఇబ్బంది పెట్టాలని ఎత్తు వేశాడు చంద్రబాబు. అదికాస్తా ఇప్పుడు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ రాజకీయ భవిష్యత్కే చేటు తె్చ్చేలా మారింది. వైసీపీ ప్రభుత్వం ఇటీవలే సీఆర్డీఏ చట్టం, మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి శాసన మండలి ఆమోదానికి పంపింది. అయితే శాసనమండలిలో సంఖ్యాబలం అధికంగా విపక్ష టీడీపీ ఆ బిల్లును అసలు సభలో ప్రవేశపెట్టకుండానే అడ్డుకుంది. రూల్ 71 అస్ర్తన్ని సంధించి బిల్లులను ఏకంగా సెలక్ట్ కమిటీకి పంపారు. బిల్లుల ఆమోదాన్ని ప్రశ్నార్ధకం చేసింది. ఈ మొత్తం తంతంగంలో టీడీపీ అధినేత చంద్రనేత చ్రకం తిప్పారు. ఎత్తులు వేశారు. తన రాజకీయ చతురతతో అధికార పక్షంపై స్వల్ప విజయాన్ని సాధించారు.
ఆ ఆనందం ముణ్ణాళ్ల ముచ్చటగానే మారింది. అధికార పక్షంపై గెలుపు సాధించించేందుకు బాబు వేసిన ఎత్తుకు ఇప్పుడు ఆయన తనయుడు నారా లోకేష్ చిత్తయ్యే పరిస్థితి ఏర్పడింది. శాసన మండలిలో టీడీపీ ఇ చ్చిన షాక్కు సీఎం జగన్కు, అటు వైసీపీ శ్రేణులకకు దిమ్మ తిరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు మొత్తంగా శాసనమండలి వ్యవస్థనే రద్దు చేసేందుకు జగన్ ఇప్పుడు పావులు కదుపుతున్నాడు. అసెంబ్లీలో అందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. దీనిపై ఇప్పటికే నిపుణులతో సంప్రదింపులు కూడా జరిపారు. ఇదే విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ సైతం వెల్లడించారు. ఇక అసలు చిక్కంతా ఇక్కడే వచ్చింది. శాసనమండలి రద్దుతో నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ శూన్యంలో పడనుంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అసెంబ్లీలో పోటీచేసి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు మండలి వ్యవస్థ రద్దయితే ఆయనకు ఉన్న ఆ ఎమ్మెల్సీ పదవి పొతుంది. దీంతో రాజకీయంగా ఎలాంటి హోదా ఉండబోదు. ఇప్పడిదే విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.