సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మాణంలో సిద్ధార్థ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిన కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాపై కొద్ది రోజులుగా ప్రేక్షకుల్లో ఎక్కడాలేని క్యూరియాసిటీ పెంచేశాడు వర్మ. వరుసగా రిలీజ్ అవుతోన్న స్టిల్స్, టీజర్లు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. తాజాగా వదిలిన ట్రైలర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు డైరెక్టర్ వర్మ. ట్రైలర్ చేసిన చిత్ర యూనిట్… రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేసింది.
అయితే, ట్రైలర్లోనే సినిమా ఎలా ఉండబోతుందో పూర్తిగా హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్ వర్మ. వాళ్ల దారిలోనే వెళ్లి బయపెట్టాలి అంటూ… హత్య రాజకీయాలకు తెరతీసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలకు తెర తీశారని చెప్పే ప్రయత్నం చేశాడు వర్మ. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని బాబు క్యారెక్టర్ విమర్శలు చేస్తూ… హత్యలకు తెగపడ్డారని చూపించారు.
పార్టీ మరో ఐదేళ్లు ఇలాగే ఉంటే కష్టమంటూనే… ఇక బుడ్డోడు పార్టీని లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నాడని తండ్రి కొడుకులు మాట్లాడుకునే సందర్భాన్ని కూడా ట్రైలర్లోనే చూపించాడు. ఈ డైలాగ్ పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి వేసిందే అని తెలుస్తోంది. కళ్లు పెద్దవి చేసి చూస్తే… బయపడేది లేదని అసెంబ్లీలో సీఎం చెప్పే సందర్భాన్ని ప్రస్తావించారు వర్మ.
చివర్లో పవన్‌కళ్యాణ్‌ను అరెస్టు చేయాలనుకోవడం.. తాను సినిమాల్లోకి వెళ్లను రాజకీయాల్లోనే ఉంటానని పవన్ చెప్పడం.. చివరకు సీఎం క్యారెక్టర్ తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పడం లాంటి కట్స్ ట్రైలర్లో చూపించిన వర్మ సినిమాపై ఆసక్తిని పెంచారు. ఇక సినిమాను ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.