అక్కినేని నాగేశ్వర్రావు కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చిన సుమంత్ నటవారసత్వాన్ని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. అయితే సుమంత్ నటించిన కొన్ని సినిమాలు జనాలను అలరించినప్పటికి తరువాత తన కేరీర్‌ను నిలబెట్టే సినిమాలు చేయలేకపోయాడు. ఇప్పుడు మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమా సుమంత్ తన కేరీర్‌కు కు ఏమైనా ఉపయోగపడుతుందా లేదా చూడాలి. ఇప్పుడు సుమంత్ నటించే సినిమాకు టైటిల్ ఖరారు చేశారు.
ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ హీరోగా రూపొందుతున్న సినిమాకు కపటధారి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. ట్విట్టర్ ద్వారా కపటధారి మోషన్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్న నాగార్జున చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ ట్వీట్‌కు సుమంత్ స్పందిస్తూ.. థ్యాంక్స్ చినమామ అని కామెంట్ చేశారు.
కన్నడంలో సూపర్ హిట్ అయిన కావలుధారి సినిమాకు ఇది తెలుగు రీమేక్. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో డా.ధనంజయన్ నిర్మిస్తున్నారు. తెలుగు వెర్షన్లో సుమంత్, నాజర్, నందిత, పూజా కుమార్, వెన్నెల కిషోర్, జయప్రకాశ్, సంపత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కపటధారి సినిమానైనా సుమంత్ కేరీర్‌ను నిలిపే చిత్రం అవుతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్.