వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఇటీవలే ఓ వేడుకకు హాజరై సామాజిక ఉద్యమకారుడు పెరియార్‌ను ఉటంకిస్తూ ఆయన చేసిన ఉపన్యాసం వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై రజినీ క్షమాపణలు చేపట్టాలని పెరియార్ అభిమానుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. వాటిపై రజినీకాంత స్పందించారు. ౖఎట్టి పరిస్థితిలోనూ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
అసలు విషయం ఏమిటంటే తమిళ మ్యాగజైన్ తుగ్లక్ 50వ వార్షికోత్సవాన్ని చైన్నైలో నిర్వహించగా కార్యకమ్రానికి రజనీకాంత్ హాజరై ప్రసగించారు. ఈ సందర్భంగా సామాజిక ఉద్యమకారుడు పెరియార్ రామస్వామిపై ఆయన అభ్యంతకర వ్యాఖ్యలను చేశారు. మూఢనమ్మకాలపై పజ్రలను చైతన్యవంతులను చేయడానికి 1971లో పెరియార్ ఏకంగా సీతా రామలక్ష్మణుల విగ్రహాలకు చెప్పుల దండలు వేసి ఊరేగించారని ఉటంకించారు. ఈ వాఖ్యలపై ద్రవిడార్ విడుతలై ఖజగం తప్పుపట్టింది. రజనీ చెప్పినదాంట్లో ఏమాత్రం నిజం లేదని మండిపడింది. బేషరతుగా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని, లేకంటే సూపరస్టార్ ఇంటినీ, దర్బార్ సినిమా నడుస్తున్న థియేటర్లను ముట్టడిస్తామని హెచ్చరించింది. కోయంబత్తుర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.
ఆ వ్యాఖ్యలపై సూసపర్‌స్టార్ స్పందించారు. పోయేస్ గార్డెన్‌లోని తన నివాసం ఎదుట మీడియాతో మాట్లాడారు. తాను ఉటంకించిన పెరియార్ ర్యాలీ తిరస్కరించాల్సిన అంశం కాదని, అది కేవలం మరిచిపోవాల్సి విషయమని వివరించారు. అదీగాక తాను చెప్పిన విషయం తన సొంత అభిప్రాయం కాదని, ఓ ఆంగ్ల పత్రికలో దానిని చదివానని అదే ఉపన్యాసంలో చెప్పానని రజినీ చెప్పుకొచ్చారు. ఆ విషయంలో నేను ఎవరికీ క్షమాపణలు చెప్పబోనని, ఆ సంఘటనపై విచారణ కూడా చేయనని సూపర్‌స్టార్ కుండబద్దలు కొట్టి మరీ తేల్చి చెప్పాడు. తాను చెప్పిన విషయానికి ఇప్పటికీ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. మరి స్పందనపై పెరియారిస్టులు ఎలా స్పందిస్తారో?