టాలీవుడ్ సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేష్‌బాబు తన సినిమాలను కూల్‌గా ఫినిష్ చేసుకోవడం అనవాయితీ. అయితే అదే సమయంలో మహేష్‌బాబు దర్శకుడు మాత్రం యమ టెన్షన్లో ఉన్నారు. ఎందుకంటే.. ఇప్పటికే పూర్తి కావాల్సిన సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడ, సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయమే ఉండటంతో ఆ దర్శకుడు టెన్షన్ అంతా ఇంతా కాదు. ఇంతకు ఏ సినిమానో ఇప్పటికే మహేష్ బాబు అభిమానులకు అర్థమయ్యె ఉంటది. అదేనండీ.. సరిలేరు నీకెవ్వరూ సినిమానే ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడికి టెన్షన్ పెడుతున్నది.
సంక్రాంతి సినిమా పుంజులైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, ఎంత మంచివాడవురా చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాయి. అల వైకుంఠపురములో సినిమా ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలి ఉండగా.. సరిలేరు నీకెవ్వరు సినిమాకి మాత్రం ప్యాచ్ వర్క్ తోపాటు ఒక పాట కూడా పెండింగ్ ఉంది. మహేశ్ బాబు మిల్క్ వైట్ బ్యూటీ తమన్నాల కాంబినేషన్ లో చిత్రీకరించాల్సిన ఐటెమ్ సాంగ్”షూటింగ్ మాత్రం ఇంకా పూర్తవ్వలేదు. ఆల్రెడీ ఈ సాంగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏడెకరాల స్థలంలో స్పెషల్ సెట్ కూడా వేశారు.
అయితే పెండింగ్‌లో ఉన్న ఈ పాట చిత్రీకరణ ఒక రెండ్రోజుల్లో పూర్తి చేసి.. ప్యాచ్ వర్క్ ఫినిష్ చేయాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. అయితే.. సినిమా షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరగకపోతుండడం దర్శకుడు అనిల్ ని టెన్షన్ కి గురి చేస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత వేగంగా జరుగుతున్నప్పటికీ.. సినిమా రిలీజ్ కి సరిగ్గా నెల రోజులు ఉండగా ప్రమోషన్స్ కంటే షూటింగ్ కే ఎక్కువ సమయం కేటాయిస్తుండడం అనిల్ టెన్షన్ కి కారణమవుతుంది. అంతే కాదు ఈ పాట చిత్రీకరణ పూర్తి చేసి.. ప్యాచ్ వర్క్ పూర్తి చేసే సరికే పుణ్యకాలం గడిసిపోతుందని దర్శకుడి బాధ. ఇక ప్రమోషన్ ఎప్పుడు చేయాలో తెలియక అనిల్ తెగ టెన్షన్ పడుతున్నాడు.