ఒక్క క్లైమాక్స్‌ చిత్రీకరణ కోసమే అన్ని కోట్ల?

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, జక్కన్న రాజమౌళి కలయికలో వస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ఇప్పటికే టాలివుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం సెట్స్‌కు మీదకు వెళ్లక ముందు నుంచే ఆసక్తి నెలకొల్పుతున్నది. ఆ తరువాత రోజుకో కొత్త అంశంతో తెలుగు చిత్రసీమలో చర్చనీయాంశంగా నిలుస్తున్నది. ప్రేక్షకుల్లో హైప్‌ను పెంచుతున్నది. ఇద్దర్‌ యంగ్‌ హీరోల సరసన హాలివుడ్‌ నటి ఓలివియా మోరిస్‌ను, బాలివుడ్‌ నటి ఆలియాభట్‌ను ఎంపిక చేసిన రాజమౌళి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాజాగా చిత్రం మొత్తం రూ. 450 కోట్లతో తెరకెక్కుతుండగా అందులో ఏకంగా భారీ మొత్తాన్ని కేవలం పతాక సన్నివేశాల చిత్రీకరణకే వెచ్చించనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు జక్కన్న. ఏకంగా క్లైమాక్స్‌ కోసం రూ. 150 కోట్లను వెచ్చించనున్నట్లు తెలుస్తున్నది.

సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే 75శాతం మేరకు పూర్తయినట్లు టాలివుడ్‌ వర్గాల సమాచారం. కేవలం పతాక సన్నివేశాలను తెరకెక్కించాల్సి ఉన్నట్లు తెలుస్తున్నది. వాటిని మన్యంలో షూటింగ్‌ చేయాల్సి ఉన్నట్లు తెలుస్తున్నది. అందులో భాగంగా ఒక పాటను సైతం చిత్రీకరించనున్నారు. ఈ పతాక సన్నివేశాల కోసం జక్కన్న ఏకంగా రూ. 150 కోట్లను వెచ్చించనున్నట్లు పక్రటించి సంచలనం రేకేత్తించారు. అదీగాక ఇప్పటికే క్లైమాక్స్‌ పాటను ప్రజాగాయకుడు గద్దర్‌తో రాయించడమేగా, పాడించాలని ప్లాన్‌ చేస్తున్నట్లు టాలివుడ్‌ వర్గాలు తెలుపుతుండడం మరొక విశేషం. జక్కన్న ఏ స్థాయిలో ఈ క్లైమాక్స్‌లను తెరకెక్కిస్తున్నారోనని అందరిలో ఆసక్తి నెలకొంది.

Tags: climax shooting, jr ntr, rajamouli, RamCharan, RRR Movie