చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న సురేష్ ప్రొడక్షన్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సురేష్ ప్రొడక్షన్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకు సురేష్ ప్రొడక్షన్ సంస్థపై ఐటీ దాడులు చేయడం పై చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది.
అందుతున్న సమాచారం ప్రకారం సురేష్ ప్రొడక్షన్ కంపెనీ ఆఫీసులతో పాటు, రామానాయుడు సిని స్టూడియోలోనూ ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి. సురేష్ ప్రొడక్షన్ ను ప్రముఖ నిర్మాత కీ.శే. డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు 1964లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మాణం చేశారు. చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, థియోటర్ యజమానులుగా సురేష్ ప్రొడక్షన్‌కు మంచి పేరుంది.
రామానాయుడు మరణం తరువాత ఈ సంస్థను ఆయన పెద్ద కొడుకు డి.సురేష్‌బాబు నిర్వహణలో ఉంది. అయితే ఇప్పటికే ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఈ సంస్థ నిర్మిస్తుంది. చిన్న చిత్రాలను నిర్మించి లాభాలు ఆర్జించారు. అయితే ఇప్పుడు సడన్‌గా సురేష్ ప్రొడక్షన్‌లో ఐటీ దాడులు జరగడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారే ఉలిక్కిపడింది. ఈ సంస్థ పై ఐటీ దాడులు జరుగుతున్న తీరుతో చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల్లో అలజడి రేగుతుంది.