సాధారణంగా ఏ ప్రభుత్వం కూడా రహస్య జీవోలని ఇవ్వకూడదు. ప్రభుత్వం తరుపున విడుదలయ్యే ఏ జీవో అయిన పబ్లిక్ డొమైన్ లో ఉండాలి. కానీ ఏ ప్రభుత్వం కూడా అలా చేయదు. ఎక్కువ శాతం రహస్య జీవోలనే విడుదల చేస్తాయి. దీంతో ఈ రహస్య జీవోలు ఎక్కువ అయిపోతున్నాయని కేంద్రం కూడా ఇటీవల కొన్ని ఆదేశాలని జారీ చేసింది. ప్రభుత్వం నుంచి వచ్చే ఈ జీవో కూడా రహస్యంగా ఉండకూడదని, అన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని, అటు కోర్టులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
అయితే ఇంత జరిగిన పారదర్శక పాలనే ధ్యేయమంటూ ముందుకెళుతున్న ఏపీ ప్రభుత్వం ఈ రహస్య జీవోల్లో రికార్డులు సృష్టిస్తుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలోనే అనేక రహస్య జీవోలని విడుదల చేశారు. మళ్ళీ వీటిల్లో రెవిన్యూ శాఖలో ఎక్కువ రహస్య జీవోలు ఉన్నాయి. ఈ ఒక్క శాఖలోనే 31 జీవోలని తీసుకొచ్చారు. ఇక పంచాయితీ రాజ్, ఫైనాన్స్, మున్సిపల్ అడ్మిన్ శాఖల్లో పది పది చొప్పున జీవోలు వచ్చాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే…. ఈ జీవోలని రిలీజ్ అయితే జీవో నెంబర్లు ఉంటున్నాయి గానీ, అందులో మేటర్ ఏంటో తెలియనివ్వడం లేదు.
ఇలా రహస్యంగా జారీ చేసిన అన్ని జీవోలని కాన్ఫిడెన్షియల్ గానే ఉంచుతున్నారు. ఇలా పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా సీక్రెట్ గా ఉంచారంటే…అవి ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నట్లే. అలాగే సొంత ప్రయోజనాల కోసమే వాటిని రిలీజ్ చేశారని అనుకోవచ్చు. ఇవి రహస్య జీవోలని ఏ మాత్రం తెలిసిన విమర్శలు రావడం ఖాయం. అయితే ఏపీ ప్రభుత్వం ఆరు నెలల్లోనే ఇన్ని జీవోలు విడుదల చేయడం వెనుక లోగుట్టు ఏదో ఉందని అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యంగా రెవిన్యూ శాఖలో అన్ని జీవోలు రావడం అనుమానాలు కలిగేలా చేస్తున్నాయి. ఇందులోనే రంగుల కోసం ప్రభుత్వం దాదాపు రూ. 2 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే సీఎం సొంత ఇంటి కోసం కొన్ని బిల్లుల్లో కూడా జీవోలు విడుదల చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి రహస్య జీవోలు రిలీజ్ చేయడంలో ఏపీ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించేలా ఉంది.