అవును మీరు విన్నది నిజమే.. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు.. ఇప్పుడు రాజకీయాలకు సెలవు ప్రకటించి ఆటో డ్రైవర్‌గా మారాడు. అయ్యో ఆయనకు ఎంత కష్టం వచ్చింది. అధికారం చేజారగానే అంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు ఎందుకు..? రాజకీయాల్లో సీనియర్.. అధికారం ఏమైనా శాశ్వతమా…? ఇప్పుడు కాకపోతే మరోసారి అధికారం వస్తుంది. కానీ ఇట్లా రాజకీయాలు చేయకుండా ఆటో నడుపుకోవాలనే ఈ వింత ఆలోచన ఎందుకు వచ్చినట్లు… చంద్రబాబును ఆటో డ్రైవర్‌గా చూసినప్పటి నుంచి పాపం కడుపు తరుక్కుపోతుంది…
ఇంతకు మీరు చెపుతున్నది నిజమేనా అనుకుంటున్నారా..? అవునండి బాబు.. చంద్రబాబు నిజంగానే ఆటో డ్రైవర్‌గా అవతారమెత్తారు… అదేంటీ అవతారమెత్తారని అంటున్నారు.. నిజంగా కాదా… అవును చంద్రబాబు ఆటోడ్రైవర్ గా అవతారమెత్తింది నిజమే.. కాకుంటే నిజజీవితంలో కాదు.. రీల్ జీవితంలో చంద్రబాబు పాత్రదారి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇంతకు ఏ రీల్ జీవితంలో అనుకుంటున్నారా…? అదేనండీ బాబు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలోనది..
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో చంద్రబాబు పాత్రదారిగా నటిస్తున్న నటుడు ఇందులో ఆటో డ్రైవర్ పాత్ర పోషిస్తున్నట్లు ఈ రోజు ఆర్‌జీవీ సోషల్‌మీడియాలో పోస్టు చేసిన పోస్టర్‌లోనిది. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్ విడుదల పోస్టర్‌లో పప్పుబాబు, చంద్రబాబు పాత్రలలో కూడిన పోస్టర్‌ను పోస్టు చేశారు. ఈ పోస్టర్ చూసిన వారికి చంద్రబాబు పరిస్థితి ఇంతలా దిగజారిందా అనిపించకమానదు. ఏమైనా రామ్ గోపాల్ వర్మా మజాకా అంటున్నారు.. చంద్రబాబు అవతారం చూసి.