సోషల్ మీడియాలో రికార్డులతో అదరగొడుతున్న టీజర్. ఆ టీజర్ విడుదల అయిన గంటల వ్యవధిలోనే లక్షలాది వ్యూవర్స్ తో దుమ్ముదులుపుతుంది. ఇప్పటి వరకు విడుదల అయిన టీజర్లలో నాకెవ్వరు సరిలేరు అని గర్వంగా దూసుకుపోతున్న ఈ టీజర్‌లో హీరోయిన్ మిస్సయింది. రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్న ఈ టీజర్‌లో హీరోయిన్ రష్మీక లేకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించిందే అయినా.. అమె ఫ్యాన్స్ బాగానే హర్టయ్యారనే టాక్ వినిపిస్తుంది. దర్శకుడు కావాలనే రష్మీకను ముందు నుంచి నిర్లక్ష్యం చేస్తున్నారని అభిమానులు అంటున్నారు.
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది. ఈ టీజర్ ఇప్పటికే ఇండియాలో ట్రెండింగ్ లో నెంబర్‌వన్ పొజిషన్‌లో ఉంది. అంటే రికార్డులతో మోత మోగిస్తున్న ఈ టీజర్‌లో హీరోయిన్ రష్మీక మందన్న లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి గతంలోనూ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేసిన సమయంలో కూడా హీరోయిన్ రష్మీకను విస్మరించారు. కేవలం ప్రిన్స్ మహేష్‌బాబు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన దర్శకుడు తరువాత ఆ లోటును సరిచేసుకున్నారు.
అయితే ఇప్పుడు విడుదల చేసిన టీజర్ లోనూ దర్శకుడు కనీసం ఒక్క ప్రేమ్‌లో కూడా రష్మీకను చూపించలేదు. ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి, ప్రఖ్యాత నటుడు ప్రకాశ్‌రాజ్‌కు ఈ టీజర్‌లో స్థానం ఇచ్చిన దర్శకుడు కేవలం రష్మీకకు మాత్రం స్థానం ఇవ్వకపోవడం పట్ల రష్మీక, అమె అభిమానులు నిరూత్సహానికి గురవుతున్నారు. టీజర్ దాదాపుగా నిమిషమున్నర నిడివితో కట్ చేశారు. కానీ కనీసం ఒక్కసెకన్ కూడా రష్మీకను చూపించలేకపోయాడు దర్శకుడు. ఇప్పుడు ఇది టాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీస్తుండగా, మరో టీజర్‌ను రష్మీక విడుదల చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.